ర‌జ‌నీని దేవుడిలా క‌మ‌ల్ హాస‌న్ ని భ‌గ‌వ‌ద్గీత‌గా భావించే న‌టుడు!

Update: 2021-04-09 05:48 GMT
బాహుబ‌లి త‌ర్వాత మ‌ళ్లీ సౌత్ నుంచి గొప్ప విజ‌యం అందుకున్న చిత్రంగా కేజీఎఫ్ పేరు మార్మోగింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 360కోట్ల షేర్ వ‌సూలు చేసింద‌ని రిపోర్టులు వ‌చ్చాయి. బాలీవుడ్ లో వంద‌కోట్లు పైగా వ‌సూలు చేసి సంచ‌ల‌నంగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ని రిలీజ్ చేసేందుకు య‌ష్ - ప్ర‌శాంత్ నీల్ - హోంబ‌లే బృందాలు స‌న్నాహ‌కాల్లో ఉన్నాయి. 16 జూలై 2021 న KGF చాప్టర్ 2 విడుదలకు సిద్ధమవుతోంది.

ఆ క్ర‌మంలోనే ఈ సినిమాకి య‌ష్ త‌న‌వంతు ప్ర‌చారం సాగిస్తున్నారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అత‌డి డౌన్ టు ఎర్త్ నేచుర్ మ‌రోమారు బ‌య‌ట‌ప‌డింది. ఒక పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేసినా అతడిలో మునుప‌టి మంచిత‌నం ఒదిగి ఉండే స్వభావం ఎక్కడికీ వెళ్ల‌లేద‌నేది అభిమానులు చెప్పే మాట‌.

ఇటీవల ఓ చాటింగ్ లో కమల్ హాసన్- రజనీకాంత్- షారుఖ్ ఖాన్ అనే గొప్ప స్టార్ల పై త‌న అభిప్రాయాన్ని చెప్పారు య‌ష్‌. ``క‌మల్ సర్ నటన భగవద్గీత. రజనీకాంత్ దేవుడు.. ఆయ‌న‌ మా తలైవా.. షారూక్ అందరికీ ప్రేరణ ..అత‌డు మేధావి``` అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. బాలీవుడ్ నుండి ఎవరితో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని ప్ర‌శ్సించ‌గా... వెంటనే నవాజుద్దీన్ సిద్దిఖీ తో న‌టిస్తాన‌ని తెలిపారు. రాఖీ భాయ్ గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న య‌ష్.. ఇక‌పైనా వ‌రుస పాన్ ఇండియా చిత్రాల‌తో స‌త్తా చాటేందుకు ఏ ఒక్క అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌డం లేదు. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ చిత్రంలో సంజ‌య్ ద‌త్ లాంటి స్టార్ న‌టించ‌డంతో అటు బాలీవుడ్ లోనూ విప‌రీత‌మైన క్రేజ్ నెల‌కొంది. మరోసారి కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియాపై ఎదురు తిరిగే రాఖీభాయ్ యాక్ష‌న్ చూడాల‌ని అభిమానులు క‌సిగా ఉన్నారు.
Tags:    

Similar News