గ్యాప్‌ ను దేవరకొండ.. శర్వసామ్‌ ఫిల్‌ చేసేనా?

Update: 2020-02-01 05:11 GMT
ఈ సంవత్సరం కు సంక్రాంతి సినిమాలు టాలీవుడ్‌ కు మంచి ఆరంభంను ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అల వైకుంఠపురంలో మరియు సరిలేరు నీకెవ్వరు చిత్రాలు భారీ వసూళ్లను దక్కించుకున్నాయి. ఈ రెండు సినిమాలు కలిసి దాదాపుగా 230 కోట్ల షేర్‌ ను వసూళ్లు చేసినట్లు గా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. అల వైకుంఠపురంలో నాన్‌ బాహుబలి రికార్డును సాధించి ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. సరిలేరు నీకెవ్వరు కూడా మంచి వసూళ్లతో నిలిచిందని అంటున్నారు. సంక్రాంతి తర్వాత రిపబ్లిక్‌ డే సందర్బం గా ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలు వస్తాయి.

ఈసారి కూడా డిస్కోరాజా రిపబ్లిక్‌ డేకు వచ్చాడు. కాని రవితేజ డిస్కోరాజాగా తీవ్రంగా నిరాశ పర్చాడు. ఆ సినిమా మరీ దారుణంగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి సినిమాల జోరు ముగిసింది ఇలాంటి సమయంలో తర్వాత విడుదలైన సినిమాల జోరు బాక్సాఫీస్‌ వద్ద కనిపించాలి. కాని ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి సందడి లేదు. ఇటీవల వచ్చిన అశ్వథ్థామ మరియు చూసి చూడంగానే చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద కళను తీసుకు రాలేక పోయారు.

జనవరి తర్వాత వచ్చే ఫిబ్రవరి లో సినిమాలను విడుదల చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి మరియు మార్చిలు రెండు నెలలు కూడా పరీక్షల సీజన్‌. కనుక ఈ రెండు నెలలు బాక్సాఫీస్‌ వద్ద గలగల ఉండదు. కాని కొన్ని సార్లు మాత్రం ధైర్యం తో ఫిబ్రవరి లో సినిమాలు వస్తుంటాయి. ఈ ఫిబ్రవరిలో ఈ 7వ తారీకున జాను... 14వ తారీకున విజయ్‌ దేవరకొండ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలున్నాయి.

సంక్రాంతి సినిమాల తర్వాత పలు చిత్రాలు వచ్చినా కూడా అవి ఆకట్టుకోక పోవడంతో బాక్సాఫీస్‌ వద్ద గ్యాప్‌ వచ్చింది. మరి ఆ గ్యాప్‌ ను జాను మరియు వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రాలు ఫిల్‌ చేస్తాయా లేదా చూడాలి. ఒక వేళ ఈ చిత్రాల ఫలితాలు అటు ఇటు అయితే సమ్మర్‌ సినిమాలు వచ్చే వరకు బాక్సాఫీస్‌ వెల వెల కొనసాగుతూనే ఉంటుందని ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News