'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్ తోనే ..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ పేట్ల దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు మహేష్. అయితే 'ఆర్.ఆర్ ఆర్' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న జక్కన్న.. ఆ సినిమా తర్వాత కాస్త బ్రేక్ తీసుకొని మహేష్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయనున్నాడు. దీనిని బట్టి చూస్తే మహేష్ తో రాజమౌళి ప్రాజెక్ట్ షురూ చేయడానికి చాలా టైం పట్టనుందని అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి ప్రాజెక్ట్ కంటే ముందు మహేష్ మరో సినిమా చేసే ఆలోచన చేస్తున్నారని.. అది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అని టాక్ నడుస్తోంది.
మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇంతకముందు 'అతడు' 'ఖలేజా' వంటి సినిమాలు వచ్చాయి. వీరి కలయికలో హ్యాట్రిక్ మూవీ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హాసిని అండ్ హారిక బ్యానర్ లో మహేష్ తో త్రివిక్రమ్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నాడట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. ఏప్రిల్ లేదా మే నెలలో 'ఎన్టీఆర్30' సినిమాని స్టార్ట్ చేయాలని చూస్తున్న త్రివిక్రమ్.. 2022 ప్రథమార్థంలో రిలీజ్ చేసేలా షూటింగ్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారట. ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే మహేష్ తో సినిమా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. నిజానికి అప్పుడెప్పుడో త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని మహేష్ ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. మళ్ళీ ఇప్పుడు మరోసారి 'మహేష్ - త్రివిక్రమ్' కాంబో వార్తల్లో నిలిచింది. ఈసారైనా హ్యాట్రిక్ మూవీ సెట్ అవుతుందో లేదో చూడాలి.