• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'వకీల్ సాబ్'లో పవన్...

'వకీల్ సాబ్'లో పవన్ పంచెస్ హైలైట్ అవుతాయా..??

By - Tupaki Desk
Update: 2021-01-09 14:00 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా తెరకెక్కిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శృతిహాసన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తుండగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా రూపొందిస్తున్నారు. తమిళంలో కూడా అజిత్ హీరోగా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. తెలుగు వెర్షన్ వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా దాదాపు టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే అయితే వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ నుండి పవర్ స్టార్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. ఇక తాజాగా వకీల్ సాబ్ టీజర్ డేట్ అండ్ టైం ప్రకటించే సరికి పవన్ కళ్యాణ్ అభిమానులలో ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఏకంగా ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికలలో ట్రెండ్ సృష్టించేందుకు హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నెల 14న అంటే సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం 6గంటలకు వకీల్ సాబ్ టీజర్ విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయరుగా ఆడపిల్లల స్వేచ్చ గురించి ప్రస్తావించే సన్నివేశాలు, డైలాగ్స్ అన్ని కూడా హైలైట్ గా నిలుస్తాయని.. అంతేగాక క్లైమాక్స్ సన్నివేశాలలో పవన్ విశ్వరూపం చూస్తారని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చూడాలి మరి వకీల్ సాబ్ అంచనాలు రీచ్ అవుతుందో లేదో..!!
Tags:    
  • Dil Raju 
  • Vakeel Saab 
  • Vthemovie 
  • Pink Remake 
  • Dil Raju Upcoming Movies 
  • Tollywood Movies 

Similar News

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

Copyright @2026

Powered by Blink CMS