లవ్ స్టోరి మరో దేవదాస్ అవుతుందా?
వాళ్ళిద్దరు భగ్న ప్రేమికులు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమనే సర్వస్వంగా భావిస్తుంటారు. ఆ స్వచ్ఛమైన ప్రేమలో మునిగి తేలుతూ ఆనందంగా గడుపుతుంటారు. హాయిగా సాగుతున్న తమ లవ్ స్టోరికి సడెన్ బ్రేక్ పడింది. ఈ స్వచ్ఛమైన ప్రేమికులు తమ ప్రేమను త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల నుండి వాళ్ళు బయటపడలేకపోవడం.., చివరికీ ఒకరికి తెలియకుండా ఒకరు తమ ప్రేమను త్యాగం చేయాలనుకుంటారు. మరి నిజంగానే తమ స్వచ్ఛమైన ప్రేమని త్యాగం చేశారా? లేక మళ్ళీ కలిశారా? అన్నది తెలియాలంటే `లవ్ స్టోరి` సినిమా చూడాల్సిందే అంటున్నారు గాసిప్ రాయుళ్ళు.
ఇంతకి ఆ కథేంటంటే నాగచైతన్య్య-సాయిపల్లవి జంటగా `లవ్ స్టోరి` సినిమా రూపొందుతున్న విషయం విదితమే. శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్రీకరణ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా మేలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. `ఫిదా ` తర్వాత మూడేళ్ళ గ్యాప్‌తో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం మెయిన్ గా స్వచ్ఛమైన ప్రేమ కథతో... ఓ మంచి పనికోసం ప్రేమని త్యాగం చేసే కాన్సెప్ట్ తో శేఖర్ కమ్ముల రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. దేవదాస్, లైలా మజ్ను వంటి చిత్రాల్లో ప్రేమ త్యాగాన్నేకోరుకుంది. మరి ఇందులో ఆ త్యాగం ఎలా ఉంటుందో అనేది తెరపైనే చూడాలి.
ఇందులో ఫస్ట్ టైమ్ నాగచైతన్య.. సాయిపల్లవి కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ జోడి సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇటీవల విడుదలైన `హే పిల్లా` పాట శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. దీనికి పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్నారు.