• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లక్ష్మీస్ ఎన్టీఆర్.. మే1...

లక్ష్మీస్ ఎన్టీఆర్.. మే1 విడుదలవుతుందా?

By - Tupaki Desk
Update: 2019-04-30 11:55 GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్.. తెలంగాణతో సహా ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసిన సినిమా.. ఏపీలోని కొందరు ప్రముఖులు హైదరాబాద్ వచ్చి మరీ ఈ సినిమాను చూశారు. ఎన్టీఆర్ చివరిరోజులు, లక్ష్మీపార్వతితో సహవాసంపై రాంగోపాల్ వర్మ తీసిన ఈ చిత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. చంద్రబాబును పక్కా విలన్ గా చూపించే ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విడుదల కాలేదు. ఏపీలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక పార్టీకి నష్టం చేసే ఈ సినిమాను విడుదల కాకుండా టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడం.. కోడ్ ఉండగా కుదరదని ఈసీ విడుదలను నిలిపివేయడం జరిగిపోయింది.

అయితే తాజగా రాంగోపాల్ వర్మ సహా నిర్మాతలు మే1న ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తన సొంతూరు బెజవాడలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు వర్మ కూడా ప్రమోషన్ కోసం వెళ్లగా అతడిని అడ్డుకొని తీవ్ర అడ్డంకులు సృష్టించారు. మార్చిలోనే విడుదల కావాల్సిన సినిమా మే1 వచ్చినా ఇంకా విడుదలపై స్పష్టత మాత్రం రావడం లేదు.

అయితే మే1 సినిమా విడుదల అవుతుందా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత రావడం లేదు. కోడ్ ఉండగా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కావద్దంటూ ఏప్రిల్ 10న ఈసీ ఆదేశాలిచ్చింది.  అయితే ఏపీలో ఏప్రిల్ 11న ఎన్నికలు ముగిశాయి. దీంతో మే 1న సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు భావించారు.

అయితే తాజాగా ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు మరో బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండే మే 23వ వరకు ఈ సినిమా విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ విషయమై  గతంలోనే నిర్మాత రాకేష్ రెడ్డికి లేఖ రాశామని తెలిపారు. అయితే కోడ్ ముగిసింది కాబట్టి విడుదల చేస్తామని వర్మ చెబుతున్నాడు.  దీన్ని బట్టి  నిర్మాతలు అనుకుంటున్న మే1 ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలవుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.
    

Tags:    
  • Laxmis NTR 
  • RGV 
  • Telugu News 
  • Latest Updaetes 

Similar News

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

Copyright @2026

Powered by Blink CMS