మామ బ‌ర్త్ డే అప్ డేట్ లేదేమి సామ్?

Update: 2019-08-29 06:22 GMT
కింగ్ నాగార్జున బ‌ర్త్ డే నేడు. పైగా ఇది అక్కినేని ఫ్యామిలీకి.. అక్కినేని అభిమానుల‌కు వెరీ స్పెష‌ల్ డే. నాగార్జున వ‌య‌సు నేటితో 60 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. అంటే షష్ఠిపూర్తి వేడుక‌ల‌కు ఆయ‌న ప్రిపేర‌య్యార‌ని దీన‌ర్థం. అయితే ఈ వేడుక‌ల‌కు సంబంధించి ఎలాంటి హ‌డావుడి క‌నిపించ‌డం లేదు ఎందుక‌నో. అక్కినేని ఫ్యామిలీ హైద‌రాబాద్ లో లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మా?  ముందే అక్కినేని కోడ‌లు స‌మంత ప్లాన్ ప్ర‌కారం.. వీళ్లంతా స్పెయిన్ ఇబిజ‌లోని అంద‌మైన బీచ్ లొకేష‌న్ లో చిలౌట్ చేస్తున్నారా?  అక్క‌డ ఏం జ‌రుగుతోంది? అంటే దేనికీ ఇంత‌వ‌ర‌కూ స‌రైన ఆన్స‌ర్ లేదు.

అందుకు సంబంధించిన ఒక్క క్లూ కూడా లేదు ఎందుక‌నో. అస‌లు ట్విట్ట‌ర్ .. ఇన్ స్టాలో ఒక్క అప్ డేట్ కూడా చెప్ప‌లేదు సామ్. నిన్న రాత్రి ఇబిజ (స్పెయిన్)లో పార్టీ అని అన్నారు.. అందుకు సంబంధించిన ఎలాంటి లీకేజీ ఫోటో కూడా వెబ్ లోకి రాలేదు. అస‌లింత‌కీ సామ్ - నాగ‌చైత‌న్య ఈ పార్టీని నిర్వ‌హించారా లేదా? అస‌లేం జ‌రుగుతోంది? అంటూ అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. కింగ్ నాగార్జున‌కు జ్వ‌రం త‌గ్గింది. ఆయ‌న స్పెయిన్ లోని ఓ రెస్టారెంట్ లో రిలాక్స్ డ్ గా ఉన్నార‌న్న స‌మాచారం అయితే నిన్న‌టి నుంచి ఉంది.

ప్ర‌తిసారీ డెస్టినేష‌న్ ఈవెంట్లో ఉన్నా.. స‌మంత ఏదో ఒక అప్ డేట్ ఇచ్చేవారు. ఇదివ‌ర‌కూ గోవాలో ర‌క‌ర‌కాల పార్టీల్ని  లేదా విదేశీ సెల‌బ్రేష‌న్స్ ని లైవ్ అప్ డేట్స్ కూడా ఇచ్చారు. వారం రోజులుగా ఇబిజ‌లో చైత‌న్య‌తో క‌లిసి ప‌ర్య‌టిస్తున్న సామ్ అందుకు సంబంధించిన ఫోటోల్ని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. నిన్న‌టిరోజున సంథింగ్ స్పెషల్ ఫోటో ఒక‌టి షేర్ చేసిన సామ్ .. ఆ త‌ర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు ఎందుక‌నో. మామ బ‌ర్త డే పార్టీ గురించిన క‌నీస స‌మాచారం అయినా ఇవ్వ‌లేదు ఎందుక‌నో. ఇంత‌కీ ఇబిజ బీచ్ రిసార్ట్ లోనే ఈ పార్టీ చేస్తున్నారా?  భూత‌ల స్వ‌ర్గాన్ని త‌ల‌పించే చోట పార్టీ అంటే అంద‌రికీ ఆస‌క్తి ఉంటుంది. మ‌రి సామ్ ఏదీ దాచేయ‌కుండా ఏవైనా కొన్ని ఫోటోల్ని  ఫ్యాన్స్ కోస‌మైనా లీక్ చేస్తారేమో చూడాలి.


Tags:    

Similar News