• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మా' విజేతలకు ఎవరు...

'మా' విజేతలకు ఎవరు అభినందనలు తెలియజేయరేంటి?

By - Tupaki Desk
Update: 2021-10-12 14:30 GMT
'మా' అసోసియేషన్ పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు.. ఎప్పుడూ లేనంతగా నువ్వా నేనా? అన్న రీతిలో సాగిన ఎన్నికల్లో ఎన్నో మలుపుల మధ్య.. ఎట్టకేలకు పోలింగ్ పూర్తి కావటం..సినీ హీరో కమ్ మోహన్ బాబు పుత్రరత్నమైన  మంచు విష్ణు 'మా' అధ్యక్షుడిగా చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన 'మా' ఎన్నికల్ని చూసినప్పుడు పోలింగ్ వేళలో కాస్తంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నా.. ఫలితాల తర్వాత ప్యాచప్ అయిపోవటం.. ఏమైనా అరకొర మిగిలి ఉంటే.. రెండు రోజుల్లో సర్దుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఫలితాలు విడుదలై మూడో రోజుకు అంతా సర్దుబాటు జరిగిపోవటం.. అభినందనల సభలు జరుగుతుండటం తెలిసిందే.

కానీ.. ఈసారి అందుకు భిన్నంగా విష్ణుకు ఎలాంటి సభలు.. సమావేశాల్ని నిర్వహించలేదు. చివరకు సినీ ప్రముఖులు అన్న వారు సైతం సైలెంట్ గా ఉండిపోయారే తప్పించి.. ఎవరూకూడా నోరు విప్పి మంచు విష్ణుకు శుభాకాంక్షలు.. అభినందనలు అన్న మాట అన్నది లేదు. చివరకు మీడియా ముందుకు వచ్చిన మంచు విష్ణు.. తాను గెలిచిన విషయం టీవీల్లో చూసినంతనే తనకు మొదటి ఫోన్ చేశారని చెప్పటం గమనార్హం. అంటే.. మంచు ఫ్యామిలీకి ఫోన్ చేసిన తారక్.. శుభాకాంక్షలు తెలిపినట్లుగా మంచు విష్ణే ఓపెన్ అయ్యారు . ఇదంతా ఒక  వ్యూహం ప్రకారం సాగిందన్న మాట వినిపిస్తోంది.

'మా' బరిలో నిలిచింది విష్ణునే అయినప్పటికీ.. తానే స్వయంగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందో.. అంతే తీవ్రతను మోహన్ బాబు ప్రదర్శించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఇంత ఆరాటం ఉన్నప్పుడు ఆయనే నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుండేది కదా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. క్రాస్ ఓటింగ్ కూడా భారీగా సాగిందన్న ప్రచారం సాగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత సినీ ప్రముఖుడు ఎవరూ ఓపెన్ గా మట్లాడకపోవటానికి కారణం.. బయటకు కనిపిస్తున్న ప్రశాంతత మొత్తం తుపాను ముందు వచ్చేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటివరకు జరిగిన 'మా' ఎన్నికల పోలింగ్ ఒక ఎత్తు.. ఇప్పుడు జరిగింది మరొక ఎత్తు కావటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ఎపిసోడ్ పూర్తిగా వ్యక్తిగతం కావటం.. గెలవటమే లక్ష్యంగా పెట్టుకొని గెలిచేసిన విష్ణు.. ఎన్నికల్లో విజయం సాధించొచ్చు కానీ.. సినిమా ఇండస్ట్రీలోని చాలామంది మనసుల్ని గెలుచుకోలేదన్న వాదన వినిపిస్తోంది. ఇదంతా ప్రకాశ్ రాజ్ తరఫున మెగా క్యాంప్ చేస్తున్న దుష్ప్రచారమని వాదిస్తున్నారు. ఏతావాతా సినీ ప్రముఖుల వరకు ఈ ఎన్నికలు.. కరవమంటే కప్పకు కోపం..విడువమంటే పాముకు కోపం అన్న సామెత చందంగా మారటంతో ఎవరికి వారు సైలెంట్ గా ఉన్నట్లు చెబుతున్నారు.
Tags:    
  • Vishnu Manchu 
  • MAA 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS