గ్లామర్ షో చేసింది.. వస్త్రం అన్నారట!

Update: 2020-03-18 09:30 GMT
కాలానికి తగ్గట్టు వస్త్రధారణ మారిపోతుంది. అప్పట్లో మా ఊర్లో గోచి పెట్టుకుని తిరిగేవారు అంటూ ఇప్పుడు కూడా తిరిగితే జనాలు రాళ్ళతో కొట్టే అవకాశం ఉంటుంది. ఇక గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల వస్త్రధారణ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. అందరూ కాకపోయినా చాలామంది భామలు ఈమధ్య హాటుగా కనిపించడం అనేది సాధారణ విషయం అన్నట్టుగా మార్చారు.

సినిమాల్లో పాత్రను బట్టి కొంత గ్లామర్ షో ఎలాగూ తప్పదు. నిజ జీవితంలో అలా కనిపించాల్సిన అవసరం ఉండదు. కానీ కొంతమంది భామలు సందర్భం ఏదైనా తాము కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడుస్తున్నాం అన్నట్లుగా ఊహించుకుని మరీ రెడీ అయి కనిపిస్తున్నారు. ఈమధ్య ఒక హీరోయిన్ ఒక మహిళల కార్యక్రమానికి హాజరయిందట. చాలామంది పెద్ధస్థాయి వ్యక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం తనకు అలావాటైన రీతిలో షర్టు లాంటి టాప్ ధరించి క్లీవేజ్ అందాలను ధారపోసిందట. ఆ కార్యక్రమ రాగం ఈ హాటు తాళానికి లంకె కుదరలేదు. దీంతో తమ రాగానికి తగ్గట్టుగా డ్రెస్సు తాళం మార్చుకోమని సున్నితంగా చెప్పారట.

అయితే ఆ టాప్ కు బటన్లు లేవు.. వేరే టాప్ అందుబాటులో లేదు. దీంతో ఆమె అసిస్టెంట్ ఆ టాప్ కు రెండు కుట్లు వేసి మరీ అందాల వడ్డనను అడ్డుకోవాల్సి వచ్చిందట. ఏదేమైనా ఇలాంటి ప్రదర్శనలు ఫోటో స్టోరీలకు పనికొస్తాయి కానీ మహిళా శిశు సంక్షేమం లాంటి కార్యక్రమాలకు పనికిరాదని ఆ భామకు తెలియక పోవడం విడ్డూరమే. స్టోరీ ఏదైనా సరే.. నాలుగు ఫైట్లు పెట్టే కొందరు డైరెక్టర్ల తరహాలో కార్యక్రమం ఏదైనా క్లీవేజ్ ఫెస్టివల్ చెయ్యడమే పనిగా పెట్టుకుంటే ఎలా?
Tags:    

Similar News