అవుట్ డేటెడ్ హీరోయిన్ కోసం మెగా స్టార్ ఎక్స్ ప్లనేషనా?

Update: 2020-04-10 06:15 GMT
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్నారు.  ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా మొదట త్రిషను ఎంచుకున్న సంగతితెలిసిందే. అయితే ఇక షూటింగ్ లో జాయిన్ కావడమే ఆలస్యం అనుకునే సమయంలో త్రిష సినిమా నుంచి తప్పుకుని అందరికీ షాక్ ఇచ్చింది. క్రియేటివ్ డిఫరెన్సుల కారణంగా సినిమానుంచి తప్పకున్నానని వెల్లడించింది.

అయితే ఈ సినిమాలో మొదట చెప్పిన విధంగా కాకుండా త్రిష పాత్ర నిడివి తగ్గించారని.. పారితోషికం సవరించారని.. 'ఆచార్య' టీమ్ తో విభేదాలు ఉన్నాయని..  అందుకే త్రిష సినిమా నుంచి తప్పుకుందని పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ విషయంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి త్రిష తప్పుకోవడంపై వివరణ ఇచ్చారు.  త్రిషకు 'ఆచార్య' టీమ్ మెంబర్స్ ఎవరితోనూ విభేదాలు లేవని.. త్రిషకు మణిరత్నం సినిమా ఆఫర్ వచ్చిన కారణంగా 'ఆచార్య నుంచి తప్పుకుందని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ వివరణపై కూడా భారీగా చర్చలు జరిగాయి.

నిజానికి ఒక సినిమాకు నటీనటులను ఎంచుకోవడం.. కొందరు తప్పుకోవడం అనేది సాధారణంగా జరిగే విషయమే. ఇలాంటి విషయాలపై మెగాస్టార్ స్థాయి వ్యక్తులు స్పందించరు. అలాంటిది ఈ విషయంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చెయ్యడం ఆయన ఔన్నత్యమని ఎక్కువమంది భావిస్తున్నారు.  ఇక అభిమానులైతే త్రిష ఓ అవుట్ డేటెడ్ హీరోయిన్ అని.. చిరంజీవి 'స్టాలిన్' చేసిన సమయంలోనే  త్రిష టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిందని అంటున్నారు. ఇప్పుడు  త్రిషకు తెలుగులో అవకాశాలే లేవని.. ఈ సమయంలో త్రిషకు ఆఫర్ ఇవ్వడమే ఎక్కువ.. అలాంటిది సినిమాను వదిలేసి వెళ్తే చిరంజీవి వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదని అంటున్నారు.

పాయల్ రాజ్ పుత్ వెంకటేష్ తోనూ.. రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జునతోనూ  జోడీ కట్టారని.. ఇలా కొత్త తరం భామలే సీనియర్ హీరోలతో జోడీ కడుతున్న సమయంలో త్రిష ఈ సినిమా నుంచి తప్పుకున్నందుకు చిరంజీవి క్లారికేఫిషన్ ఇవ్వడం అనవసరమని అంటున్నారు. అయినా చిరు అలా చేయడం ఆయన ఇతరులకు ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుందని అంటున్నారు.
Tags:    

Similar News