ఆర్జీవీ ఆ బయోపిక్ తో ఎవరిని టార్గెట్ చేయబోతున్నాడు..?
'శివ' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పటికి తన సినిమాలతో సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూనే ఉన్నాడు. కాకపోతే ఒకప్పుడు 'వర్మ ఏమి సినిమా తీసాడు రా' అని పొగిడిన వాళ్ళే 'వర్మ ఏంటిరా ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు' అనే స్టేజికి వచ్చేసాడు. అయితే సినిమా జయాపజలతో సంబంధం లేకుండా ఆర్జీవీ సినిమాలు తెరకెక్కిస్తూ లాభాలను గడిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వర్మ ముఖ్యంగా వాస్తవ సంఘటలు.. నిజ జీవిత పాత్రలు.. సంచలనం సృష్టించిన అంశాలను తీసుకొని సినిమాలుగా మలచడం స్టార్ట్ చేసాడు. ఆ సినిమాలు తీయడానికి ఇన్స్పిరేషన్ ఏంటో చెప్పి కొన్ని.. చెప్పకుండా ఫిక్షనల్ స్టోరీస్ అంటూ మరికొన్ని మూవీస్ రూపొందించాడు. ఈ నేపథ్యంలో 'రక్తచరిత్ర' 'వంగవీటి' 'అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు' 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్టుగా ''మర్డర్'' అనే సినిమా కూడా వాస్తవ ఘటన ఆధారంగా తీస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశా ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని సినిమా తీయబోతున్నాని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాజాగా ''పవర్ స్టార్'' అనే కాంట్రవర్సియల్ మూవీని ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ తీయబోయే తదుపరి సినిమాలపై ఆసక్తి పెరిగింది.
కాగా ఇటీవల 'పవర్ స్టార్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న వర్మ నెక్స్ట్ తీయబోయే ప్రాజెక్ట్స్ పై మాట్లాడారు. ఈ సందర్భంగా ''ఆ రోజు రాత్రి ఏమి జరిగింది?'' అనే సినిమా తీస్తున్నారట కదా అని అడుగగా.. దీనికి వర్మ మాట్లాడుతూ 'ఆ రోజు రాత్రి ఏమి జరిగింది?' అనే సినిమా తీస్తున్నట్లు నేను ప్రకటించలేదు. మీడియాలో ఈ వార్తలు చూసే నాకు ఆలోచన వచ్చింది. ఈ సినిమా నేను తీయొచ్చు తీయకపోవచ్చు. ఇప్పుడే దీని గురించి ఎక్కువ మాట్లాడాను అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో బియోపిక్స్ తీసే ఆలోచన ఉందని.. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తున్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ లో ఒక్కప్పుడు వరుస సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ అర్థాంతరంగా తనువు చాలించిన సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని మరణించడం అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమని షాక్ కి గురి చేసింది. ఉదయ్ ఆత్మహత్య చేసుకోడానికి నెపోటిజం మరియు ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు కారణమని అందరూ చర్చించుకున్నారు. ఇప్పుడు వర్మ ఈ బయోపిక్ తీయడానికి అతన్ని ప్రేరేపించిన అంశాలు ఏమై ఉంటాయని సినీ జనాలు ఆలోచిస్తున్నారు. వర్మ సినిమా అంటేనే ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉంటుంది. అది సెటైరికల్ గా అయ్యుండొచ్చు లేదా రియల్ స్టోరీ అయినా అయ్యుండొచ్చు. ఇప్పుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ వార్తలు నిజమైతే ఆర్జీవీ ఎవరిని టార్గెట్ చేస్తూ ఈ మూవీ తెరకెక్కిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. రామ్ గోపాల్ వర్మ చర్యలు ఊహాతీతం. మరి ఆయన ఈ బయోపిక్ తీస్తాడో లేదో త్వరలోనే ఓ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.