ద‌ర్శ‌క‌ధీరుడికి ఖ‌రాకండిగా `నో` చెప్పాడ‌ట‌

Update: 2021-08-30 00:30 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ప్ర‌తిపాద‌న‌ను బాహుబ‌లి ప్ర‌భాస్ తిర‌స్క‌రించారా?  ఖ‌రాకండిగా నో చెప్పేశారా? అంటే అవున‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ దేని విష‌యంలో అంటే రిలీజ్ తేదీ విష‌యంలో ప్ర‌భాస్ రాజీకి రాలేద‌ని తెలుస్తోంది.

RRR అక్టోబర్ 2021 లో విడుదల కావాల్సి ఉండ‌గా.. సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌వుతుంద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం సాగుతోంది. కానీ ప్రస్తుత పెండింగ్ ప‌నులు చూస్తే ఉగాది 2022 వరకు రిలీజ్ క‌ష్ట‌మేన‌ని గుస‌గుస వినిపిస్తోంది. అలాగే ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి బ‌రి నుంచి వైదొల‌గేందుకు మ‌రో కార‌ణం కూడా క‌నిపిస్తోంది. రాజమౌళి 2022 సంక్రాంతికి RRR విడుదల చేయాలంటే అంత‌కుముందే.. ప్రభాస్ `రాధే శ్యామ్` నిర్మాత‌ల‌ను సంప్ర‌దించార‌ట‌. రాధేశ్యామ్ తేదీ మారితే ఆర్.ఆర్.ఆర్ కి లైన్ క్లియ‌ర‌వుతుంది. కానీ దానికి ప్ర‌భాస్ అతని నిర్మాతలు  రాజమౌళి అభ్యర్థన మేరకు మాత్రమే సంక్రాంతి 2022 కి తమ విడుదలను వాయిదా వేసుకున్నారు కాబట్టి ఈసారి కొత్త ప్ర‌తిపాద‌న విష‌యంలో రాజమౌళికి `నో` అని చెప్పారు. తాము రెండోసారి ఎలాంటి అభ్యర్థనను ప‌రిశీలించ‌లేమ‌ని వారు తెగేసి చెప్పేశార‌ట‌. సంక్రాంతి సీజన్ లో రాధే శ్యామ్ తో పాటు ఆర్. ఆర్ .ఆర్ విడుదల చేస్తే తమకు ఎలాంటి సమస్య లేదని కూడా క్లియ‌రెన్స్ ఇచ్చేశార‌ట‌. ప్రభాస్ టీమ్ నుంచి ఈ తిరస్కరణ తర్వాత మాత్రమే RRR బృందం ఉగాది 2022 విడుదలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు స‌న్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

RRR చిత్రీక‌ర‌ణ సాంతం పూర్తయిందని ఇంత‌కుముందు అధికారికంగా ప్రకటించారు. హీరోలు ఇద్దరూ క్లీన్ షేవ్ తో లుక్ నుండి బయటకు వస్తారని అభిమానులు భావించారు. కానీ రాజమౌళి తన సిగ్నల్ లేకుండా షేవ్ చేయవద్దని హీరోలిద్దరినీ ఆదేశించాడనేది మ‌రో గుస‌గుస‌. రాజమౌళి ఇంకా మూవీ షాట్స్ లో ఫ‌స్ట్ కట్ చూసి మొత్తం సంతృప్తి పొందే వరకు హీరోలను ఒకే లుక్ లో ఉంచాలని అనుకున్నాడు. ఏదైనా రీషూట్ చేయాల్సి ఉంటుందని లిటిగేష‌న్ పెట్టార‌ట‌. అవ‌స‌రం అనుకుంటే ఏ క్ష‌ణ‌మైనా ఆ ఇద్ద‌రు హీరోల‌ను తిరిగి పిలిచేందుకు ఆస్కారం లేక‌పోలేదు. బాహుబలి షూటింగ్ సమయంలో కూడా ఇలానే రాజ‌మౌళి స్టార్ల‌ను వెన‌క్కి పిలిచి రీషూట్లు చేశారు. ఆర్.ఆర్.ఆర్ విష‌యంలోనూ ఎందులోనూ రాజీకి రావడం లేదు జ‌క్క‌న్న‌.

ప్ర‌భాస్.. చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్ ల‌తో స‌రే మ‌హేష్ తో ఎప్పుడు?

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఇప్ప‌టికే  అగ్ర క‌థానాయ‌కులంద‌రితో సినిమాలు చేశారు. ఒక్కరిద్ద‌రు త‌ప్ప‌. అందులో మ‌హేష్ పేరు ముందు వ‌రుస‌లో ఉంది. రాజ‌మౌళితో ప్రాజెక్ట్ పై మ‌హేష్ లో క్యూరియాసిటీ! ఉన్నా ఎందుక‌నో ఇన్నాళ్ల వ‌ర‌కూ కుద‌ర‌లేదు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ - ద‌ర్శ‌క ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి కాంబినేష‌న్ లో భారీ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌నుందని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ ఈ ప్రాజెక్ట్  గురించి అధికారిక క‌న్ప‌ర్మేష‌న్ లేనే లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ పై రాజ‌మౌళి వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్క్రిప్టును రెడీ చేస్తున్నారు.

స్క్రిప్టు ఫైన‌ల్ అయ్యాకే మహేష్ కానీ రాజ‌మౌళి కానీ అధికారికంగా సినిమాని ప్ర‌క‌టిస్తారు. ఇక‌ ఆ టైమ్ రానుంద‌ని ఇంత‌కుముందు మ‌హేష్ బ‌ర్త్ డే వేళ గుస‌గుస వినిపించింది. జ‌క్క‌న్న‌తో సినిమా అనే విష‌యాన్ని మ‌మేష్ కూడా మ‌న‌సులో దాచుకోలేక‌పోతున్నారు.. ఆగ‌స్టు 9న త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా మ‌హేష్ ఈ విష‌యాన్ని అధికారికంగా రివీల్ చేసారు. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి కాంబినేషన్ లో చాలా ప్ర‌త్యేక‌మైన చిత్రం రాబోతుంద‌ని వెల్ల‌డించారు.  అలాగే ఇది `బాహుబ‌లి` లాంటి  భారీ విజువ‌ల్ సినిమా కాద‌ని కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగ‌ని సాధార‌ణ సినిమా కూడా  కాదు.  అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసే స్థాయిలో జ‌క్క‌న్న స్క్రిప్ట్  ఉంటుంద‌ని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ కు వెళుతుంద‌న్న‌ది మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు.
Tags:    

Similar News