సింగిల్ లాంగ్వేజ్ లో సత్తా మిగతా వాళ్లకు అసాధ్యమే!
ఇటీవలే రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం 'ధురంధర్' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 1300 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది.;
ఇటీవలే రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం 'ధురంధర్' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 1300 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. సింగిల్ లాంగ్వేజ్ లోనే ఈ వసూళ్లతో ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. అందుకే సగర్వంగా సింగిల్ లాంగ్వేజ్ లోనే అంటూ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ ప్రకటనా రిలీజ్ చేసింది. ఇదీ బాలీవుడ్ సత్తా అంటూ గర్వంగా ప్రకటించింది. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. మరి సింగిల్ లాంగ్వేజ్ లో సత్తా చాటడం మిగతా భాషలకు సాధ్యం కాదా? పాన్ ఇండియాని షేక్ చేసిన టాలీవుడ్, శాండిల్ వుడ్ సింగిల్ లాంగ్వేజ్లో రికార్డుల వసూళ్లు కొట్టలేరా? అంటే నో డౌట్ అనే చెప్పాలి.
సింగిల్ లాంగ్వేజ్ లో తెలుగు సినిమానో? కన్నడ సినిమా నో రిలీజ్ అయి 1000 కోట్ల క్లబ్లో చేరడం అంటే కలలో కూడా జరగని పని అది. 'ధురంధర్' పాన్ ఇండియా లో సక్సెస్ అయిందంటే? అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. ఇది హిందీ చిత్రం. పాన్ ఇండియాలో అన్ని భాషల్లోనూ హిందీ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయింది. డబ్బింగ్ తో రిలీజ్ చేసే అవకాశం ఉన్నా? ఆ ఛాన్స్ తీసుకోకుండా పాన్ ఇండియాలో హిందీలోనే రిలీజ్ చేసారు. దేశంలో చాలా రాష్ట్రాలు హిందీ మాట్లాడే రాష్ట్రాలే. దక్షిణాది రాష్ట్రాలు మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో హిందీ కనిపిస్తుంది.
స్థానిక భాషలున్నా? హిందీని టచ్ చేస్తారు. సౌత్ లో కూడా చాలా చోట్ల హిందీ మాట్లాడుతారు. మెట్రో పాలిటిన్ సిటీస్ లో హిందీ ఆచరణలో కనిపిస్తుంది. స్థానిక భాషలున్నా సిటీస్ లో నార్త్ కల్చర్ కనిపిస్తుంది. హిందీతో పాటు ఊర్దూ కూడా హైలైట్ అవుతుంది. 'ధురంధర్' కాన్సెప్ట్ అన్ని వర్గాలతో పాటు ఓ వర్గానికి బాగా కనెక్ట్ అయింది. ఆ వర్గానికి సంబంధించిన కల్చర్ సినిమాలో ఎక్కువగా హైలైట్ అవుతుంది. పాకిస్తాన్ నేపథ్యం వంటి అంశాలు సినిమాకు బాగా కలిసొచ్చాయి. రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా సహా చాలా పాత్రలు రియలిస్టిక్ గా ఎక్స్ పీనియరన్స్ ను అందించాయి.
వెరసీ ఇవన్నీ 'ధురంధర్' ని బ్లాక్ బస్టర్ చేసాయి. పాన్ ఇండియాలో తెలుగు సినిమాలు 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చాలా చిత్రాలున్నాయి. కానీ అవన్నీ ఆయా స్థానిక భాషల్లో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారు. 'ధురందర్' మాత్రం దేశమంతా ఒకే భాషతో రిలీజ్ అయి బంతాడేసింది. త్వరలో మరిన్ని పాన్ ఇండియా రిలీజ్ లు రెడీ అవుతున్నాయి. అవి కూడా సక్సెస్ అయితే బాలీవుడ్ నెంబర్ వన్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం ఖాయం.