ఏఏ సినిమాలు ఏఏ లొకేష‌న్స్‌?

Update: 2019-05-06 08:17 GMT
ప్ర‌స్తుతం టాలీవుడ్ లో డ‌జ‌ను పైగానే భారీ క్రేజీ సినిమాలు ఆన్ లొకేష‌న్స్ బిజీ షెడ్యూల్స్ తో ఉన్న సంగ‌తి తెలిసిందే. వీటిలో ఏ సినిమా షూటింగ్ ఎక్క‌డ జ‌రుగుతోంది? అన్న‌ది ప‌రిశీలిస్తే ఇంట్రెస్టింగ్ సంగ‌తులే తెలిశాయి. వివ‌రాల్లోకి వెళితే..

జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ కాంబినేషన్ లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్ ఆర్ ఆర్`  సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. ఈ షూటింగ్ లో ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొంటున్నార‌ని స‌మాచారం. మెగాస్టార్  చిరంజీవి కధానాయకుడిగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `సైరా నరసింహారెడ్డి` సినిమా షూటింగ్ ఈరోజు నుంచి జమ్మలమడుగులో 9 వరకు జరుగుతుంది. మే 10 నుంచి  వికారాబాద్ లో 13 వరకు షూటింగ్ చేయ‌నున్నారు. ఇదే నెల‌ 13 నుంచి 20 వరకు దండు మైలారం లో షూటింగ్ ఉంటుంది. దీంతో మొత్తం  షూటింగ్ పూర్త‌వుతుందని తెలుస్తోంది. విక్ట‌రీ వెంకటేష్, నాగచైతన్య కాంబినేష‌న్‌ మల్టీ స్టారర్  `వెంకీ మామ` షూటింగ్  ఈనెల 15 నుంచి హైదరాబాద్ లో జరుగనుంది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా,  ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న `వి` సినిమా షూటింగ్ హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.

కొన్ని సినిమాల షూటింగ్ లు ఔట్ డోర్ లో సాగుతున్నాయి. వీటిలో ఆర్‌.ఎక్స్‌100 ఫేం కార్తికేయ కథానాయకుడిగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న `గుణ 369` షూటింగ్ ఒంగోలు లో జరుగుతోంది. యువ‌హీరో రాజ్ తరుణ్ హీరోగా, జి.ఆర్. కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న `ఇద్దరి లోకం ఒకటే` షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. వెర్స‌టైల్ స్టార్ శ‌ర్వానంద్- స‌మంత జంట‌గా ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 96 రీమేక్ కెన్యాలో తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం. ఇత‌ర‌త్రా సినిమాల షెడ్యూల్స్ వివ‌రాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News