• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆర్.ఆర్.ఆర్' పోస్టర్ తో...

'ఆర్.ఆర్.ఆర్' పోస్టర్ తో పవన్ కు లింకేంటి..?

By - Tupaki Desk
Update: 2021-06-30 06:30 GMT
విప్లవవీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ జీవితాల ఆధారంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఫిక్షనల్ పీరియాడికల్ మూవీ ''ఆర్.ఆర్.ఆర్''(రౌద్రం రణం రుధిరం). యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల తర్వాత ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌ లో తిరిగి ప్రారంభమైంది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్టు RRR టీమ్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఈ సందర్భంగా రామరాజు - భీమ్‌ బైక్ పై రైడ్ కి వెళ్తున్న ఓ పోస్టర్ ని 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఫోటోపై ఎన్నో ఎడిటెడ్ పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి. ఇతర హీరోలు - క్రికెటర్లను బైక్ కూర్చోబెట్టి వారి అభిమానులు అనేక రకాల ఫోటోలు వదులుతున్నారు. 'షోలే' సినిమాలో అమితాబ్ - ధర్మేంద్ర బైక్ పెళ్లాడాన్ని మరోసారి గుర్తు చేసారని కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో RRR బైక్ కు పవన్ కళ్యాణ్ కు లింక్ చేస్తూ ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే తారక్ - చరణ్ లు కలసి రయ్ రయ్ అని వెళ్తున్న పాతకాలపు బుల్లెట్.. ఆల్రెడీ పవన్ వాడేసాదట.

'జల్సా' సినిమాలో పవన్ బైక్ పై కూర్చున్న ఫోటోని RRR పోస్టర్ ని జత చేస్తూ పవర్ స్టార్ ట్రెండ్ సెట్ చేసేవాడే కానీ ఫాలో అయ్యేవాడు కాదు అంటూ పీకే ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలో బైక్ లను గమనిస్తే రెండూ ఒకేలా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆర్.ఆర్.ఆర్ కు పవన్ కు లింక్ అయ్యిందని అభిమానులు అంటున్నారు. ఇకపోతే 'RRR' షూటింగ్ తో పాటుగా నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు. ఇప్పటికే తెలుగు - తమిళ భాషలకి సంబంధించిన డబ్బింగ్‌ పూర్తి చేసిన ఎన్టీఆర్‌ - చరణ్‌.. మిగిలిన భాషలకి డబ్బింగ్‌ చెప్పడానికి సన్నద్ధమవుతున్నారు. దసరా సందర్భంగా అక్టోబరు 13న RRR విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు.
Tags:    
  • Rrr Movie 
  • Hbd Jr Ntr 
  • Alia Bhatt 
  • Rajamaouli 
  • Jr Ntr 
  • Komaram Bheem 
  • Telugu News 

Similar News

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

RC 17: నాన్నకు ప్రేమతో కాదు.. ఈసారి అమ్మకు ప్రేమతో..!

2026-11-03 17:51 GMT

దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?

2026-11-03 17:50 GMT

విజయ్ దేవరకొండ కష్టం మొత్తం ఎక్కడికి పోతుంది?

2026-11-03 17:30 GMT

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS