• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మాస్టర్ చెఫ్' పట్ల...

'మాస్టర్ చెఫ్' పట్ల టాలీవుడ్ మేల్ సెలబ్రిటీలకు ఏమైంది..??

By - Tupaki Desk
Update: 2021-06-16 03:30 GMT
మనం ఇప్పటివరకు టీవీ షోలలో ఎన్నో రియాలిటీ షోస్ చూసాం. కానీ వంటకు సంబంధించిన ప్రోగ్రాంస్ మాత్రం చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. ఈ వంటల్లో కూడా లోకల్ లేదా ప్రాంతం వరకు చాలా కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాం. కానీ కుకింగ్ షోలలో అన్నిటికన్నా పాపులర్ షో మాత్రం 'మాస్టర్ చెఫ్' అనే చెప్పాలి. ఆస్ట్రేలియా మొదలుకొని అమెరికాతో పాటు అనేక ప్రపంచదేశాల్లో ఈ మాస్టర్ చెఫ్ విజయవంతంగా నిర్వహించబడుతుంది. అలాగే అనేక దేశాలతో పాటు ఇండియాలో కూడా పదేళ్లుగా మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం చూస్తూనే ఉన్నాం.

దాదాపు మూడు దశాబ్దాలుగా మాస్టర్ చెఫ్ అనేది విదేశాల్లో సక్సెస్ అవుతోంది. కానీ ఇండియాలో ఈ కార్యక్రమం 2010లో ప్రారంభమైంది. కానీ స్టార్ ప్లస్ టీవీ ఛానల్ ద్వారా కేవలం హిందీలో మాత్రమే ప్రసారం జరిగింది. ఇప్పుడు ఎక్కడికక్కడే ప్రాంతీయ భాషల్లో మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం అందుబాటులోకి తీసుకొస్తుంది సన్ నెట్వర్క్స్ యాజమాన్యం. అయితే ఈ విధంగా త్వరలో తెలుగుతో పాటు తమిళ - కన్నడ - మలయాళం భాషల్లో కూడా ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ మాస్టర్ చెఫ్ హోస్ట్ ఎవరినేది. నిజానికి మాస్టర్ చెఫ్ కన్నడ హోస్ట్ స్టార్ హీరో సుదీప్ కాగా తమిళ ప్రోగ్రాంకు విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.

అయితే ఇప్పుడు తెలుగులో మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంను హోస్ట్ చేయనుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఈ ప్రోగ్రాంలో హోస్ట్ గా తమన్నా ఎంపిక అవ్వడంతో ఓవైపు పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నప్పటికి మరోవైపు మేల్ హోస్ట్ లేరా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వేరే భాషల్లో ఈ షోను మేల్ సెలబ్రిటీలే హోస్ట్ చేస్తుండగా.. తెలుగులో మాత్రం మేల్ సెలబ్రిటీలకు ఏమైంది అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సుదీప్ - విజయ్ సేతుపతి లాంటి వారే వంట ప్రోగ్రాం నిర్వహించేందుకు సిద్ధంగా ఉండగా.. తెలుగులో అంతటి స్టార్స్ - మీడియం స్టార్స్ ఏమయ్యారంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ఈ షో నిర్వహించే సామర్థ్యం టాలీవుడ్ మేల్ సెలబ్రిటీలలో లేదేమో అంటున్నారు నేటిజన్లు. ఇదిలా ఉండగా.. తమన్నా ఎంపిక అయినందుకు ఓ పక్కన హ్యాపీ అవుతున్నారు.  ఆల్రెడీ డిజిటల్ ఎంట్రీ చేసిన అమ్మడు.. ఈ షో ద్వారా టీవీ స్క్రీన్ పై మెరవనుంది. చూడాలి మరి అమ్మడు ఎలా డీల్ చేస్తుందో..!
Tags:    
  • Master Chef 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS