నేను నా రాక్షసి సినిమాలో మాదిరి సూసైడ్ ప్లాన్

Update: 2020-02-19 06:36 GMT
కని పెంచి.. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు అంతులేని శోకాన్ని మిగులుస్తూ బలవన్మరణం పాలవుతున్న వారిలో ఎక్కువమందికి పెద్ద కారణాలు కానేకావు. ఇటీవల కాలంలో సూసైడ్ చేసుకుంటున్న ఉదంతాల్ని చూస్తే.. ఇప్పటి తరానికి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. జూబ్లీహిల్స్ లోని ఫిలింనగర్లో సోమవారం సూసైడ్ చేసుకున్న విద్యార్థి గణేశ్ కు సంబంధించి బయటకు వచ్చిన విషయాలు చూస్తే షాక్ కు గురి కావాల్సిందే. ఇంజనీరింగ్ చదువుతూ.. సరిగా చదవలేకపోతున్న కారణంగా చనిపోవాలని డిసైడ్ కావటం ఒక ఎత్తు అయితే.. సూసైడ్ చేసుకోవాలన్న దానిపై యూట్యూబ్ లో పెద్ద ఎత్తున సెర్చ్ చేసినట్లుగా తెలుస్తోంది.

చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందంటూ సూసైడ్ లెటర్ రాసిన రాతల్ని చూస్తే.. అతడి ఆలోచన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్నంత మాత్రం ఫలితం ఏమీ ఉండదన్న లాజిక్ ను మర్చిపోయాడా బీటెక్ విద్యార్థి. తాను చనిపోయేందుకు నేను నా రాక్షసి సినిమాలో సింఫుల్ టెక్నిక్స్ తో చనిపోవటం ఎలా ఉన్న దానిపై విపరీతంగా వీడియోలు చూసినట్లు గా పోలీసులు చెబుతున్నారు.

తన ఆత్మహత్యకు పక్కాగా ప్లాన్ వేసుకున్న గణేశ్.. అందుకు అవసరమైన సామాన్లను ఒక్కొక్కటికి ఇంటికి తెచ్చుకోవటం గమనార్హం. ఆత్మహత్యకు పది రోజుల ముందు నుంచే ఎక్కువ బాధ లేకుండా చనిపోవటం ఎలా అన్న విషయాన్ని యూట్యూబ్ లో చూసినట్లుగా సమాచారం. ఇందులో భాగంగా ఫిబ్రవరి 14న ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి నైట్రోజన్ అక్సిజన్ సిలిండర్.. పైపులు.. పాలిథిన్ కవర్లు కొని ఇంటికి తీసుకొచ్చి దాచాడు.

ఇంట్లో ఎవరూ లేని వేళ.. నైట్రోజన్ ఆక్సిజన్ సిలిండర్ పైపులను ముక్కులోకి పెట్టుకొని.. రసాయన వాయువులు బయటకు రాకుండా పాలిథిన్ కవర్ ను చుట్టుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. బీటెక్ మొదటి సంవత్సరం లో పరీక్షల్లో ఫెయిల్ కావటం తో డిటెండ్ అయ్యాడు. మరోసారి పరీక్షలు రాసినా ఫలితం సరిగా రాక పోవటంతో చని పోవాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగా ఈ దారుణ పథకానికి తెర తీశాడు.

చేతికి వచ్చిన కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయిన వైనం తో అతగాడి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. పోయినోళ్లు బాగానే ఉంటారు. కానీ.. వారిని నమ్ముకున్నేళ్లకే కడుపుకోత అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. చని పోయి సాధించేదేమీ ఉండదు. ఏమీ ఉండదని చనిపోవటం మొదలు పెడితే.. ఎవరూ ఉండరు. జీవితాన్ని జీవించాలే కానీ.. ఇలా అర్థం లేని ఆలోచనలతో బలవన్మరణాలకు పాల్పడటం ఏ మాత్రం సరికాదు.


Tags:    

Similar News