థియేటర్లు తెరిచినా ఓటీటీలకే ఓటు...!
లాక్ డౌన్ సడలింపులతో సినీ ఇండస్ట్రీ నెమ్మదిగా మాములు స్థితికి వస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగుల సందడి తిరిగి ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం థియేటర్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతినిచ్చింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో ఈ రోజు(అక్టోబర్ 15) నుంచి తెరుచుకోవచ్చని కేంద్రం చెప్పింది. అయితే ఈ ప్రకటన వచ్చి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు టాలీవుడ్ లో ఒక్క సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించలేదు. త్వరలో థియేటర్స్ తెరుస్తారని క్లారిటీ వచ్చినా పలానా సినిమా మీ అభిమాన థియేటర్స్ లో విడుదల కాబోతోందంటూ ఇంతవరకు ఒక్క నిర్మాత కూడా ప్రకటన చేయలేదు.
థియేటర్స్ ని కేంద్రం గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఫిలిం మేకర్స్ తమ సినిమాల విడుదల తేదీలు ప్రకటిస్తారని.. ఇన్నాళ్లు ఎదురు చూసిన ప్రేక్షకులకు దసరా పండుగ నుంచి సినిమా పండుగ మొదలు కానుందని అందరూ అనుకున్నారు. అయితే ప్రొడ్యూసర్స్ మాత్రం సినిమాల థియేట్రికల్ రిలీజ్ కి వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ఆలోచిస్తున్నారట. అందులోనూ థియేట్రికల్ రిలీజ్ అంటే నిర్మాతలు చెప్పిన రేట్ కి సినిమా తీసుకునే బయ్యర్లు రావాలి. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్ కి వస్తారా అనే సందేహంతో బయ్యర్లు నిర్మాత అడిగినంత ఇస్తారో లేదో తెలియదు.
ఈ నేపథ్యంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ థియేటర్స్ ఓపెన్ చేస్తున్నా ఓటీటీలకే మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ కంప్లీట్ అయిన సినిమాలు.. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటున్న సినిమాల మేకర్స్ ఓటీటీ డీల్స్ కోసం బేరసారాలు నడువుతున్నారట. అందుకే కొన్ని పెద్ద సినిమాల విడుదల తేదీలు ఇంకా ప్రకటించలేదని తెలుస్తోంది. చిన్న మరియు మీడియం రేంజ్ సినిమాలన్నీ కుదిరితే థియేట్రికల్ లేదా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అనే పద్ధతిలో ముందుకు వెళ్తున్నారట. ఎక్కువ శాతం మంది ఫిలిం మేకర్స్ మాత్రం థియేటర్లు తెరిచినా ఓటీటీకే ఓటు వేస్తున్నారని తెలుస్తోంది.