ఎవరు మగువల కలల్లో తిష్ఠ వేసి కునుకుపట్టనివ్వరో వారే మోస్ట్ సెక్సీయెస్ట్. అలాంటి కుర్రాళ్లు ఆసియాలో ఎందరు ఉన్నారో జాబితా తిరగేస్తే అందులో బాలీవుడ్ హాట్ హీరోలు టాప్ 10లో ఎప్పుడూ నిలుస్తున్నారు. తాజాగా 2018 టాప్ 50 సెక్సీయెస్ట్ ఆసియన్ మెన్ జాబితా రిలీజైంది. ఈ జాబితాలో టీవీ నటుడు వివియన్ డిసేన రెండో ర్యాంకును అందుకోవడం సంచలనమైంది.
బాలీవుడ్ లో హృతిక్ రోషన్- షాహిద్ కపూర్- జైన్ మాలిక్- వరుణ్ ధావన్ లాంటి హీరోలు సెక్సీ హీరోలుగా పలుమార్లు రికార్డులకెక్కారు. టాలీవుడ్ నుంచి మహేష్ లాంటి హీరోకి ఆ గుర్తింపు దక్కింది. కానీ ఈ సారి వీళ్లందరినీ వెనక్కి నెట్టి ఓ టీవీ నటుడికి ఈ ఖ్యాతి దక్కడం పై యువతరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. వివియన్ డిసేన `శక్తి అస్తిత్వం కె ఎహ్సాస్ కి` షోతో ఉత్తరాదిన భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ హీరోలకు ధీటుగా అతడికి ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ కిరీటం దక్కిందన్నది ఓ అంచనా.
సెక్సీ బోయ్‌గా సెలక్ట్ అయిన వివియాన్ మాట్లాడుతూ.. అసలు ఫ్యాన్స్ లేకపోతే ఇది సాధ్యం కాదని, తనను గుర్తించి ఓటింగ్ చేసినందుకు సంతోషంగా ఉందని కృతజ్ఞతలు తెలిపాడు. 6ప్యాక్ చేయడం, కండలు పెంచడంతో సెక్సీ లుక్ రాదని, లైఫ్‌లో ప్రతిదీ బ్యాలెన్స్ చేసినప్పుడే సెక్సీ అనిపించుకోగలరని వివాన్ తెలిపాడు. 6- ప్యాక్ కంటే తాను ఎప్పుడూ నటనపైనే ఫోకస్ చేస్తానని తెలిపాడు. చిన్నప్పటి నుంచి ఫుట్ బాల్ ఆడుతున్నా. రెగ్యులర్ గా జిమ్ముకు వెళ్లలేనప్పుడు ఫుట్‌బాల్ ఆడతానని.. ఆటల వల్లనే తనకు ఈ రూపం సాధ్యమైందని వివియాన్ టాప్ సీక్రెట్‌ని రివీల్ చేశాడు. నేటి తరంలో ఔట్ డోర్ గేమ్స్ కు దూరమై వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఒత్తిడికి లోనయ్యే వారికి వివియాన్ ఓ కనువిప్పు అనే చెప్పాలి.