ఆచారితో సరసాలకు అమైరా రెడీ!

Update: 2017-03-14 13:47 GMT
మంచు విష్ణు కొత్త సినిమాపై అనౌన్స్ మెంట్ వచ్చేసింది. జి నాగేశ్వరరెడ్డితో హ్యాట్రిక్ మూవీకి ప్రిపేర్ అయిపోయాడు విష్ణు. దేనికైనా రెడీ.. ఈడోరకం-ఆడోరకం తర్వాత ఈ దర్శకుడితో మూడో సినిమాగా ఆచారి అమెరికా యాత్ర మూవీ చేయనున్నాడు మంచు హీరో. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగిపోతున్నాయి.

ఇప్పుడీ ఆచారికి జోడీని ఫైనల్ చేసినట్లు తెలియవచ్చింది. బ్యూటీ అమైరా దస్తూర్ ను విష్ణు సరసన నటించేందుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మూవీ ఇజాక్.. తమిళ్ లో అనేగన్(తెలుగు డబ్బింగ్ వెర్షన్ పేరు అనేకుడు) చిత్రాలను చేసిన అమైరా.. ఆ తర్వాత కుంగ్ ఫూ యోగ మూవీలో జాకీ చాన్ తో కలిసి నటించింది. ఇప్పుడు ఆచారి ఆమెరికా యాత్ర మూవీలో మంచు విష్ణుతో రొమాన్స్ చేయనుంది అమైరా. ఈడోరకం-ఆడోరకం మూవీలోనే విష్ణుతో అమైరా జోడీ కడుతుందని అన్నారు కానీ.. అప్పట్లో డేట్స్ అడ్జస్ట్ కాలేదు.

ఇప్పుడు అన్నీ ముందుగానే ఫైనల్ చేసుకుని.. అమైరాను తీసుకొస్తున్నాడు మంచు విష్ణు. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన బ్రహ్మాండమైన కామిక్ నవలను.. జి నాగేశ్వరరెడ్డి అదే పేరుతో సినిమాగా మలుస్తుండగా.. ఈ మూవీలో బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించనుండడం ఆసక్తి కలిగిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News