మెగాస్టార్ కోసం అప్పట్లోనే వినాయక్ 'సీఎం కథ'.. అది ఆగింది మాత్రం అందుకే!

Update: 2020-10-20 11:30 GMT
2000 దశాబ్దంలో వీవీ వినాయక్ హవా మామూలుగా నడవలేదు. సినిమాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలను డైరెక్ట్ చేసిన ఘనత వినాయక్ దే. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డు కొట్టాడు. రెండో సినిమా దిల్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఆ వెంటనే అగ్రహీరో బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వినాయక్ కి ఏకంగా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం, అది తెలుగు సినీ చరిత్రలోనే ఓ గొప్ప సినిమాగా మిగిలిపోవడం జరిగింది. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

ఇటీవల వినాయక్ ఠాగూర్ చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలను వినాయక్ పంచుకున్నారు. అసలు వినాయక్ చిరంజీవితో ఠాగూర్ కంటే ముందే మరొకరితో సినిమా చేయాలని అనుకున్నారంటా. చిరంజీవి సీఎం అయితే ఎలా ఉంటుంది.. అనే కాన్సెప్ట్ తో ఓ కథ కూడా రాసుకున్నాడట. అయితే అంతలోనే రమణను రీమేక్ చేసే అవకాశం వినాయక్ కి వచ్చింది. అంతకుముందు తాను చిరంజీవి కోసం రాసుకున్న కథలోని కొన్ని సన్నివేశాలు, డైలాగులను వినాయక్ ఠాగూర్ క్లైమాక్స్ లో వాడుకున్నారంట. ఠాగూర్ సినిమాలో క్లైమాక్స్ ఎంత ప్రత్యేకంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. అలా వినాయక్ తన సీఎం కథని ఠాగూర్ కోసం కలిపేసుకున్నారు.
Tags:    

Similar News