వినయ విధేయ రామ 2 డేస్ కలెక్షన్స్

Update: 2019-01-13 09:49 GMT
రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 26 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం రెండో రోజుకు కొంత డ్రాప్ అయింది.  రెండు రోజు షుమారుగా రూ.4 కోట్ల రూపాయల షేర్ సాధించింది. దీంతో రెండు రోజుల కలెక్షన్స్ రూ. 30 కోట్లకు చేరాయి.

ఈరోజు నుండి అందరికీ హాలిడేస్ కావడంతో థియేటర్లు వద్ద సందడి నెలకొనే అవకాశం ఉంది గానీ సినిమాకు ఉన్న నెగెటివ్ టాక్ ను ఎలా తట్టుకుని ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.   సంక్రాంతి సినిమాల్లో దేనికీ యునానిమస్ హిట్ టాక్ రాకపోవడం 'వినయ విధేయ రామ' కు కలిసి వచ్చే అంశమే. దానికి తోడుగా ట్రోలింగ్ కు గురవుతున్న ట్రైన్ సీన్ ను బోయపాటి టీమ్ తొలగించడం సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాలలో 'వినయ విధేయ రామ'  రెండు రోజులకు గానూ సాధించిన ఏరియా వైజ్  కలెక్షన్స్ ఇలా ఉన్నాయి

నైజాం: 6.80 cr
సీడెడ్: 7.57 cr
ఉత్తరాంధ్ర: 3.04 cr
ఈస్ట్: 2.31  cr
వెస్ట్: 2.09 cr
కృష్ణ: 1.81 cr
గుంటూరు: 4.51 cr
నెల్లూరు: 1.86 cr
 
టోటల్: రూ. 29.99 cr షేర్

Tags:    

Similar News