తనొక పికాసో అంటున్న చియాన్
9 నెలలు అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా(సౌందర్య హీరోయిన్)కి నేను పనిచేస్తున్నప్పుడు ఆ అవకాశం ఇప్పించింది ఎస్.ఎస్.రాజమౌళి అని నాన్నమూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన విక్రమ్ విలేకరులతో చెప్పుకొచ్చారు. ఆ సినిమాకి 1500 జీతంతో పనిచేసానని చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు విక్రమ్ రెమ్యునరేషన్ ఎంతంటే.. కోట్లలోనే. ఓ నటుడి జీవితంలో అసాధారణమైన ఫీట్ అంటే ఇంతకంటే ఏం ఉంటుంది?
ఇప్పటికి చియాన్ విక్రమ్ కెరీర్ ప్రారంభించి 15 సంవత్సరాలు అయ్యింది. వచ్చే ఏడాదితో అతడి వయసు అర్థ సెంచరీ కొట్టేస్తుంది. ఈ సందర్భంగా అతడిని ఓ రెండు ఆసక్తికర ప్రశ్నలు అడిగితే ఏమని స్పందించాడో తెలుసా? పెయింటింగ్ లతో చరిత్ర సృష్టించిన పికాసో - ఎం.ఎఫ్. హుస్సేన్ లను మనం ప్రశ్నించగలమా? ఆ పెయింట్ ని ఎందుకు అలా బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో చిత్రీకరించారు..? అని అడిగే సాహసం చేయగలమా? తాము ఆ సందర్భంలో ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. తమ భావనలకు రూపాన్ని అద్దుతారు. ఓ నటుడు కూడా అంతే. నేను ఏం చేయాలనుకుంటే అది చేశాను. ప్రయోగాలు చేశాను. నచ్చిందే చేశాను. కొత్తగా ప్రతిసారీ ప్రయత్నించాను. 10 ఎంద్రాతుకుళ్ల చిత్రంలోనూ ఆ క్యారెక్టర్ మునుపెన్నడూ చేయనిది అంటూ చెప్పుకొచ్చాడు.
అంతేకాదు 50కి దగ్గరయ్యారు కదా! వయసు అయిపోతుందని బాధనిపించలేదా? అని ప్రశ్నిస్తే ఎగ్ వైట్లు - వెజిటబుల్ ఫుడ్ తీసుకుంటూ ఇప్పటికీ జిమ్ముల్లో రోజుకి రెండుసార్లు కసరత్తులు చేస్తున్నా. వయసు అనేది నాకు గుర్తుండదు. బాధించదు అని సమాధానమిచ్చాడు. ఇంత పాజిటివ్‌గా ఉంటాడు కాబట్టే అంత ఆరోగ్యంగా శరీరాన్ని, కెరీర్ ని ఉంచగలిగాడన్నమాట! చియాన్ ని చూసి నేర్చుకోవాల్సిందే ఎవరైనా!