• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డబ్బింగ్ పనులలో బిజీ అయిన...

డబ్బింగ్ పనులలో బిజీ అయిన మాస్టర్..

By - Tupaki Desk
Update: 2020-05-12 09:30 GMT
దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి అధికం అవుతుంది. ఈ కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బతో ఎక్క‌డి వారు అక్క‌డే నిలిచిపోయి సతమతమవుతున్నారు. దేశంలో సినిమా రంగం కూడా ఒక్క‌సారిగా స్థంభించి భారీ నష్టాల్లో కురుకుపోతుంది. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే ప్రజలందరికి సినిమాలతో మస్త్ టైంపాస్ అవుతుంది. అదే సినీ ఇండస్ట్రీ ఇప్పుడు థియేటర్లు మూసివేసి సైలెంట్ అయింది. ఈ స‌మ్మ‌ర్‌లో సీజ‌న్‌లో విడుదల కావాల్సిన సినిమాల జాబితా పెద్దగానే ఉంది. కానీ కరోనా కార‌ణంగా అన్నీ వాయిదా ప‌డ్డాయి. కానీ కొన్ని సినిమాలు లాక్ డౌన్ లో కూడా పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తి చేస్తున్నాయి.
 
అయితే ఇటీవలే తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ మాత్రం తను తాజాగా నటించిన 'మాస్టర్' సినిమాను ఖచ్చితంగా విడుదల చేస్తానని చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి లభించిన తర్వాత అన్నీ సినిమాలు వర్క్ స్టార్ట్ చేసాయి. ప్రస్తుతం మాస్టర్ సినిమా డబ్బింగ్ సౌండ్ మిక్సింగ్ పనులలో బిజీగా ఉందట. ఇదివరకే హీరోయిన్ మాళవిక మోహనన్ పాత్రకు ప్రముఖ నటి రవీనా డబ్బింగ్ చెప్పేసారు. కాగా తాజా కథనాల ప్రకారం.. హీరో విజయ్ కూడా తన డబ్బింగ్ పూర్తి చేస్తున్నాడట. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డబ్బింగ్ పనులన్నీ లైన్ లో పెట్టాడట విజయ్. ఇక విజయ్ తర్వాత విలన్ విజయ్ సేతుపతి కూడా మరో వారంలో తన డబ్బింగ్ పనులను ప్రారంభింస్తాడట. ఈ 'మాస్టర్' సినిమా ఖైదీ ఫేమ్ లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది. అయితే విజయ్ కి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ని తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు.
Tags:    
  • Vijay starts dubbing for Master 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • VijayTheFaceOfKollywood 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

RC 17: నాన్నకు ప్రేమతో కాదు.. ఈసారి అమ్మకు ప్రేమతో..!

2026-11-03 17:51 GMT

దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?

2026-11-03 17:50 GMT

విజయ్ దేవరకొండ కష్టం మొత్తం ఎక్కడికి పోతుంది?

2026-11-03 17:30 GMT

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS