ఫ్యాన్స్ గోవిందం లిప్పు లాకు మిస్సయ్యారు!

Update: 2018-08-16 01:30 GMT
'అర్జున్ రెడ్డి'  అద్భుత నటనతో విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ డమ్  తెచ్చుకున్నాడు గానీ ఆ సబ్జెక్ట్ సూపర్ హార్డ్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో యాక్సెప్టెన్స్ సంపాదించలేకపోయాడు. కానీ విజయ్ తాజా చిత్రం 'గీత గోవిందం' ఒక క్లీన్ లవ్ ఎంటర్ టైనర్ అన్నట్టుగా ప్రచారం చేయడంతో ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను క్లీన్ బౌల్డ్ చేయడం ఖాయమనుకున్నారు అందరూ.  కానీ ఈ సినిమా పైరసీ క్లిప్స్ బయటకు వచ్చినప్పుడు విజయ్ - రష్మిక లిప్ లాక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

దాంతో రష్మిక పెళ్ళి చేసుకోబోయే రక్షిత్ శెట్టి అభిమానులు ఆ లిప్పు లాకులేంటి అని సోషల్ మీడియా లో విరుచుకుపడ్డారు కూడా. అదంతా అలా ఉంచితే ఈ లిప్పు లాకు సినిమాలో ఉంటుందా లేదా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కట్ చేస్తారా అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు.  ఫైనల్ గా జరిగిందేంటంటే ఆ లిప్ లాకును భారిగా కట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు.  కానీ ఫైనల్ గా టైటిల్స్ స్క్రోల్ అయ్యే సమయంలో మాత్రం ఆ గాఢ చుంబనం లోని కొంచెం పార్ట్ మాత్రం చూపించారు.

ఏదైతేనేం తన పిచ్చతో సిల్వర్ స్క్రీన్ పై హంగామా చేసిన 'అర్జున్ రెడ్డి' ని డీసెంట్ 'గోవిందం' గా మార్చి డైరెక్టర్ పరశురాం ఫుల్లు మార్కులు సాధించాడు.  ఇక ఈ స్ట్రాంగ్ లిప్ లాకును థియేటర్ లో మిస్ అయ్యారు రౌడీలు!
Tags:    

Similar News