`ఫైటర్` తర్వాత రౌడీ ప్లానింగ్ ఎవరితో?
రౌడీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ `ఫైటర్` చిత్రంతో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ లో ఈ మూవీకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇక ఈ ఏడు నెలల విరామ సమయంలో దేవరకొండ ఇంకేవైనా ప్రాజెక్టులకు కమిటయ్యారా? అతడి ప్లానింగ్ ఎలా సాగుతోంది? అంటే.. ఫిలింనగర్ గుసగుసల ప్రకారం...
పూరి చిత్రం తరువాత 2022 లో ఒక ప్రాజెక్ట్ కోసం శివ నిర్వాణ - సుకుమార్ లతో చేతులు కలుపుతున్నాడని తెలిసింది. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కలిసి అదే ఏడాది ద్వితీయార్థంలో ఓ సినిమా చేస్తాడు. అది ఓ రోమ్-కామ్ అని తెలిసింది. `పెళ్లి చూపులు`కి సీక్వెల్ గా ఉంటుందా? అన్నది విజయ్ నే చెప్పాలి.
మరోవైపు మహేష్ తో కలిసి దేవరకొండ ఓ మల్టీస్టారర్ చేస్తారని.. అలాగే ఘట్టమనేని బ్యానర్ లో ఓ సినిమా చేస్తారని కూడా ప్రచారమైంది. మరి దానికి సంబంధించి ఇటీవల ఎలాంటి అప్ డేట్ లేదు.