నిర్మాత - హీరో వారిద్దరికీ రిటర్న్ గిఫ్ట్!

Update: 2019-10-19 01:30 GMT
ప్రస్తుతం బడా నిర్మాత దిల్ రాజు - సెన్సేషనల్ హీరో విజయ్ దేవేరకొండ ఒకేలా ఆలోచించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తమకి లైఫ్ ఇచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసి ఒకే సారి రెండు సినిమాలతో సందడి చేస్తున్నారు.

అప్పటి వరకూ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న రాజు ను నిర్మాతగా పరిచయం చేస్తూ 'దిల్' అనే సినిమాను తీసాడు వి.వి. వినాయక్. ఆ సినిమా సూపర్ హిట్టై రాజు కి ముందు దిల్ అనేది చేరిపోయింది. అదే ఇంటి పేరుగా మారింది. అయితే ఆ సినిమాను తన బ్యానర్ లో తీసి తొలి సూపర్ హిట్ ఇచ్చిన వినాయక్ ను ఇన్నేళ్ళ తర్వాత హీరోగా మార్చి తన బ్యానర్ లో 'సీనయ్య' అనే సినిమా చేస్తున్నాడు దిల్ రాజు. ఒకరకంగా ఇది వినాయక్ కి రాజు నుండి అందిన రిటర్న్ గిఫ్టే.

ఇక విజయ్ కూడా అంతే. అప్పటి వరకూ అడపదపడా పాత్రలు చేసిన తనను హీరోగా పెట్టి 'పెళ్లి చూపులు' అనే సినిమా తీసి స్టార్ గా మార్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పెట్టి తన ప్రొడక్షన్ లో 'మీకు మాత్రమే చెప్తా' సినిమా నిర్మించాడు. ప్రస్తుతం విజయ్ అనుభవిస్తున్న స్టార్డం తరుణ్ భాస్కర్ తో మొదలయిందే కదా అందుకే తరుణ్ ని హీరోగా మర్చి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసాడు విజయ్. ఈ సినిమా నవంబర్ లో విడుదలవుతుంది.

ఇలా ఈ రెండు సినిమాలతో తమ కెరీర్ ని ముందుకు నడిపించిన వారికోసం సినిమాలు నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రాజు - రౌడీ. మరి వీరి దారిలోనే ఇంకెవరైనా ఇలా ఆలోచించి సినిమాలు నిర్మిస్తారా చూడాలి.
Tags:    

Similar News