ఫోటో స్టోరి: హీట్ పెంచిన బాలన్ భంగిమలు
తెలుగు ప్రేక్షకులకు విద్యాబాలను పరిచయం అవసరం లేదు. ఇక్కడా తనకు అభిమానులున్నారు. ఈ భామ రెగ్యులర్ ఫోటోషూట్లకు ఫాలోయింగ్ ఉంది. తాజాగా బాలన్ భంగిమలు మరోసారి యువతరంలో హాట్ టాపిక్ గా మారాయి. నిమ్మ పసుపు చొక్కా ముదురు పసుపు రంగు ప్యాంటు ధరించి బాలన్ హొయలు పోతున్న తీరు ప్రస్తుతం యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకర్షించగల విద్యాబాలన్ మ్యాజిక్ అదే. తాను ఏం చేసినా కాకలు పుట్టిస్తుంది. ఆ డ్రెస్ కి తగ్గట్టే హై హీల్ ధరించి రకరకాల భంగిమలతో అణువనువునా అద్భుతంగా కనిపిస్తోంది.
బాలీవుడ్ లో జీరో సైజ్ ఏల్తున్న సమయంలోనే అసలు అలాంటి బాడీకి నో చెప్పేసిన బాలన్ బొద్దుతనంతోనూ నటిగా ట్రెండ్ సెట్ చేసింది. తాను సహజ అందంతో ఆకర్షిస్తానని గర్వంగా ప్రకటించింది. కెరీర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన విద్యాబాలన్ ఇప్పుడు జల్సా చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం సెట్స్ లో చిత్రీకరణ జరుగుతోంది. ఇంతకుముందు `శకుంతలా దేవి`గా ప్రయోగాత్మక పాత్రతో ఆకట్టుకుంది. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటిగా నామినేట్ అయిన బాలన్ ..మరోసారి ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించేందుకు ముందుకొస్తోంది. బాలన్ నటించిన డర్టీ పిక్చర్ కి జాతీయ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రతో తెలుగు వారికి చేరువయ్యారు బాలన్.