వీడియో : 'ప్రాణంపంచే పోలీస్‌' పై కీరవాణి పాట

Update: 2020-11-01 07:50 GMT
ఆమద్య కరోనాపై పోరాడుతున్న వారిపై పాటను ట్యూన్‌ చేసి పాడిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మరోసారి ఒక పాటను విడుదల చేశారు. ఈసారి పోలీసుల గొప్ప మనసును వారు పడుతున్న కష్టాన్ని వివరిస్తూ ఆ పాట కొనసాగింది. ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటకు కీరవాణి ట్యూన్స్‌ ఇచ్చాడు. పోలీసుల విధి నిర్వహణలో ఎదుర్కొనే ఇబ్బందులు మరియు వారికి ఎదురయ్యే సవాళ్లను గురించి పాటలో పేర్కొనడం జరిగింది.

ఈ పాటను తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ పాట విడుదల సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21 నుండి 31వ తారీకు వరకు పోలీసు ఫ్లాడ్‌ డే కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. విధి నిర్వహణలో పోలీసులు ఇబ్బందులను వివరిస్తూ ఉన్న ఈ పాట అందరికి స్ఫూర్తిదాయకం. మనం కష్టపడుతూ సేవలు అందిస్తున్నాం. మనకు ఎంతో మంది మద్దతుగా నిలుస్తున్నారు అనేందుకు ఈ పాట నిదర్శణం అంటూ పాటను ట్యూన్‌ చేసిన కీరవాణికి మరియు అనంత శ్రీరామ్‌ కు అభినందనలు తెలియజేశారు.


Tags:    

Similar News