లాక్ డౌన్ లో పోలీసులు కొట్టడంపై స్పందించిన స్టార్ హీరో

Update: 2020-04-24 09:12 GMT
లాక్ డౌన్ లో పోలీసులు ఓ స్టార్ హీరోను కొట్టారని.. లాక్ డౌన్ ను ఉల్లంఘించినందుకు  ఈ శిక్ష వేశారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని  తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ స్పష్టం చేశారు. ‘ఉరి-ది సర్జికల్ స్ట్రైక్ ’ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన విక్కీ కౌశల్ తాజాగా ఈ మేరకు తన గురించి సోషల్ మీడియాలో.. మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వార్తలపై స్పందించారు.

విక్కీ కౌషల్ ట్వీట్ చేస్తూ.. ‘లాక్ డౌన్ ను ఉల్లంఘించి పోలీసుల చేతిలో తన్నులు తిన్నానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇలాంటి పుకార్లను వార్తలను నమ్మకండి.. అవి అవాస్తవాలు.. తాను లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంటి కాలు బయట పెట్టలేదు.. దయచేసి ప్రజలు ఇలాంటి అబద్దపు ప్రచారాలు చేయకండి’ అంటూ కోరారు.

ప్రస్తుతం విక్కీ తన కుటుంబంతో ముంబై లో క్వారంటైన్ లో ఉంటున్నారు. ఈ సందర్భం గా లాక్ డౌన్ లో అలుపెరగకుండా పోరాడుతున్న పోలీసులకు విక్కీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇక తన ఇంట్లో సరదాగా వంటలు చేస్తున్న ఫొటోలు.. సోదరుడితో దిగిన ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే విక్కీ ప్రధాన మంత్రి సహాయ నిధికి.. సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందజేశాడు.


Tags:    

Similar News