• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందాల 'ఉప్పెన' పిల్లను...

అందాల 'ఉప్పెన' పిల్లను అందుకోవడం కష్టమే!

By - Tupaki Desk
Update: 2021-09-11 03:31 GMT
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో కృతి శెట్టి పేరు ప్రధమంగా వినిపిస్తుంది .. ప్రధానంగా కనిపిస్తుంది. 'ఉప్పెన' సినిమాతో పరిచయమైన ఈ అమ్మాయి కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. బంగినపండు మామిడిపండువంటి ఈ అమ్మాయిని చూసిన పిలగాళ్లెవరూ, ఆ సినిమాను తీసేసేంతవరకూ థియేటర్లను వదిలిపెట్టలేదు.  'జల జల జలపాతం నువ్వు' పాట చూసిన తరువాత, కలలో ఆ అమ్మాయితో పడవ ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అంతగా కృతి పడుచు మనసులను ప్రభావితం చేసింది.

పాలపిండిలో .. దానిమ్మ రసం కలిపి చేసినట్టుగా కనిపించే ఈ అమ్మాయి కుర్రాళ్ల ఊహా సుందరిగా మారిపోయింది. సమ్మోహనమైన ఆమె నవ్వు చూస్తే సగం ఎనర్జీ వచ్చేస్తుందనేది వాళ్లు చెబుతున్న మాట. మున్ముందు ఈ బ్యూటీ డేట్లు దొరకడం కష్టమని, ఫస్టు సినిమా ఫంక్షన్ లోనే మెగాస్టార్ చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు కృతి శెట్టి డేట్లు దొరకడం కష్టంగా మారిపోయింది. ఈ సుందరి తమ సినిమా ఒప్పుకుంటే చాలు తమ సినిమా సగం సక్సెస్ అయిపోయినట్టేనని యంగ్ హీరోలు భావిస్తున్నారు.

కృతి శెట్టి అందమైనదే కాదు .. తెలివైనదనే విషయం కూడా ఆమె ఎంచుకునే సినిమాలను బట్టి అర్థమవుతోంది. తొలి సినిమా కొత్త హీరోతో చేసినా, ఆ సినిమా వెనక సుకుమార్ ఉన్నాడు .. మెగా ఫ్యామిలీ ఉంది అనే విషయాన్ని మరిచిపోకూడదు. ఇక ఆ తరువాత ఆమె సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుధీర్ బాబు సరసన చేయడానికి అంగీకరించింది. ఆయనతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా చేస్తోంది. ఇక నాని స్టార్ డమ్ గురించి తెలుసును గనుక, ఎలాంటి సందేహం లేకుండా 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను పూర్తి చేసింది.

ఇక ఇదే ఊపులో ఆమె రామ్ - లింగుసామి సినిమాను, 'బంగార్రాజు'లో చైతూ జోడీగాను చేయడానికి అంగీకరించింది. తాజాగా నితిన్ ప్రాజెక్టులోను మెరిసింది. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న 'మాచర్ల నిజయోజకవర్గం' సినిమాలో ఆమె నటిస్తోంది. ఇక అల్లు అర్జున్ తదుపరి సినిమా కోసం .. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ సినిమా కోసం ఈ అమ్మాయిని తీసుకోవాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అందులో వాస్తవమెంతన్నది తెలియాల్సి ఉంది. గ్లామర్ పరంగా .. నటన పరంగా .. క్రేజ్ పరంగా .. అవకాశాల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్న ఈ బ్యూటీని అందుకోవడం, మిగతా కుర్ర హీరోయిన్లకు కష్టమేనేమో!
Tags:    
  • Kriti shetty 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS