పిక్ టాక్ : మెగా ప్రిన్స్ ఉమెన్స్ డే స్పెషల్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నేడు ఉమెన్స్ డే సందర్బంగా షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతోంది. తన చెల్లి మరియు కజిన్స్ తో ఉన్న ఫోటోను షేర్ చేసిన వరుణ్ తేజ్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ తో ఉమెన్స్ డే శుభాకాంక్షలను తెలియజేశాడు. ఈ సందర్బంగా ఆయన తన చుట్టు ఉన్న మహిళలు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడవారు స్ట్రాంగ్ గా ఉండాలంటూ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.
చెల్లి నిహారికతో పాటు చిరంజీవి ఇద్దరు కూతుర్లు సుస్మిత మరియు శ్రీజ ఇంకా ఇతర కజిన్స్ ను ఈ ఫోటోలో చూడవచ్చు. ఈ ఫోటోకి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అద్బుతమైన మహిళకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఒక్క రోజు మాత్రమే కాకుండా ఎప్పుడు కూడా మీరు వెలుగుతూ.. ఎంతో మందికి జీవితాన్ని ఇస్తూ ఈ ప్రపంచంను ముందుకు నడిపించాలని కోరకుంటున్నాను అంటూ పోస్ట్ చేశాడు.
వరుణ్ తేజ్ షేర్ చేసిన ఈ ఫోటో లో ఆయన లుక్ చాలా సింపుల్ అండ్ క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అమ్మాయిల మద్య ప్రిన్స్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరి దృష్టిన ఆకర్షించే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. చెల్లి మరియు కజిన్స్ తో వరుణ్ గతంలో కూడా పలు ఫోటోలు షేర్ చేశాడు. కాని ఈ ఫోటో చాలా స్పెషల్ గా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. రెండు సినిమాలు కూడా విడుదల తేదీ కూడా ప్రకటించి ఎప్పుడెప్పుడా అన్నట్లుగా రెడీ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో మొదటిది ఎఫ్ 3. ఈ సినిమా లో వెంకటేష్ తో కలిసి వరుణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎప్ 2 కి సీక్వెల్ అనే విషయం తెల్సిందే.
ఎఫ్ 3 సినిమా ఖచ్చితంగా మంచి ఎంటర్ టైనర్ గా నిలుస్తుందనే నమ్మకం ను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు గని సినిమా తో కూడా వరుణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. వరుణ్ తేజ్ గని సినిమాలో బాక్సర్ గా కనిపించబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు లో చాలా సినిమాలు వచ్చాయి. కాని ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. గని సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.