మెగా బావకు దారి వదిలిన వరుణ్

Update: 2018-01-30 13:50 GMT
టాలీవుడ్ లో గత కొంత కాలంగా మెగా ఫైట్ మీద అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ - వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమాలు రెండు ఒకేసారి (ఫిబ్రవరి 9న) వస్తున్నాయి అని తెలిసినపుడు ఎవరు నమ్మలేదు. కానీ ఇరు చిత్రాల యూనిట్ వారు అధికారిక ప్రకటన ఇవ్వడంతో ఫైనల్ గా మెగా ఫైట్ గా సిద్ధం అని కథనాలు వచ్చాయి. అయితే రీసెంట్ గా మెగా పెద్దలు సర్ది చెప్పడంతో ఎవరో ఒకరు వెనక్కి తగ్గే అవకాశం ఉందని మరికొన్ని రూమర్స్ వచ్చాయి.

ముఖ్యంగా వరుణ్ తేజ్ తొలిప్రేమ డేట్ పై పలు అనుమానాలు చెలరేగాయి. అయితే ఫైనల్ గా ఆ కన్ఫ్యూజన్ కి చిత్ర యూనిట్ ఎండ్ కార్డ్ పెట్టేసింది. సాయి ధరమ్ తేజ్ కోసం వరుణ్ వెనక్కి తగ్గి ముందుగా బావకు దారి వదిలాడు. అంటే తొలిప్రేమ ఫైనల్ గా 10వ తేదీన రాబోతోందన్నమాట. ఈ సినిమాను దిల్ రాజు  అవుట్ రేట్ కు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా అల్లు అరవింద్ దిల్ రాజుతో చర్చలు జరిపి అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పడంతో తొలిప్రేమను 9వ తేదీ  దిల్ రాజు వెనక్కి లాగారు.
Read more!

అలాగే సాయి ధరమ్ తేజ్ వినాయక్ తో దిల్ రాజుకి మంచి రిలేషన్ ఉంది కాబట్టి ఆ తరహాలో కూడా అలోచించి దిల్ రాజు 10వ తేదీని బుక్ చేసుకున్నారు. అలాగే థియేటర్స్ లోను ఎక్కడా ఇబ్బంది కలగకుండా సెట్ చేసుకున్నారని తెలుస్తోంది. 9న ఇంటిలిజెంట్ తోబు పాటు గాయత్రీ కిర్రాక్ పార్టీ కూడా విడుదల కానున్నాయి. ఇక నిఖిల్ నిర్మాతలు ఆలోచన మారితే వారు కూడా 10వ తేదీకి వచ్చే అవకాశం ఉంది. మరి వీరందరిలో ఫిబ్రవరి వీరులు ఎవరవుతారో చూడాలి.   


Tags:    

Similar News