వర్షాల్లో పుడితే 'వరుణ్' అని పెట్టేసారా?
హ్యాడీడేస్- కొత్త బంగారు లోకం చిత్రాలతో హీరోగా ఆరంగేట్రమే అదరగొట్టాడు వరుణ్ సందేశ్. సక్సెస్ ఫుల్ హీరోగా టాలీవుడ్ లో క్షణం తీరిక లేనంత బిజీ అయ్యాడు. అయితే కొన్ని తప్పిదాలు వరుణ్ కెరీర్ ని డీప్ క్రైసిస్ లోకి తీసుకెళ్లాయి. ఎడా పెడా తనవైపు వచ్చిన ప్రతిదీ అంగీకరించి ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. దాంతో కెరీర్ ఒడిదుడుకులు తప్పలేదు. స్క్రిప్ట్- దర్శకుల ఎంపికలో వైఫల్యంతో వరుణ్ కెరీర్ అర్ధంతరంగా కిందికి పడిపోయింది. అటుపై కోస్టార్ వితిక షేరుని ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. కొన్నాళ్ల పాటు అమెరికాలో ఉన్న వరుణ్ ఇటీవల బిగ్ బాస్ లో ప్రత్యక్షమయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే సినీ ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నాడు.
తాజాగా వరుణ్ సందేశ్ తనకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకున్నాడు. వరుణ్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు సమీపంలోని బల్లిపాడు. కానీ పుట్టింది మాత్రం ఒరిస్సాలో. వరుణ్ తాతయ్య ఒరిస్సాలోనే ఉండేవారు. ఆయన ఓ కాలేజ్ ప్రోఫెసర్. 1989లో వరుణ్ పుట్టినప్పుడు అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయట. అందుకే మరో దేవుడి గురించి ఆలోచించకుండా `వరుణ్` అని పెరు పెట్టేశారట. నెల రోజుల చంటోడి గా ఉన్నప్పుడే హైదరాబాద్ కు మకాం మార్చేసారు.
భార్య వితిక షేరు గురించి వరుణ్ చెప్పాడు. తన స్వస్థలం భీమవరం. ఐదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. తర్వాత కొన్నాళ్లకు తండ్రి చని పోయారు. వరుణ్ కలిసిన తర్వాత తండ్రి లేడు అన్న బాధ నుంచి వితిక తేరుకుందిట. పెంపకం అంతా వితిక మేనమామ వద్దనే. పెళ్లయిన తర్వాత వరుణ్ తల్లి తన తల్లిగా మారి పోయిందట. అలాగే వరుణ్ సందేశ్ తన జీవితం లో ఎన్నో ఒడిదుడుకుల్ని చూసాడు. 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే షాపులో ట్రాలీలు నెట్టేవాడినని.. క్యాషియర్ గాను పనిచేసానని వెల్లడించాడు. తర్వాత కొన్నాళ్లకు ఫ్యామిలీ ఆర్ధికంగా కుదిట పడింది. ఆ తర్వాత సినిమాల్లో ప్రయత్నించానని వరుణ్ తెలిపాడు.