'వరుడు కావలెను' కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన మ్యూజికల్ మెలోడీ..!

Update: 2021-02-12 12:05 GMT
యంగ్ హీరో నాగ శౌర్య - 'పెళ్లిచూపులు' ఫేమ్ రీతూ వర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లక్ష్మీ సౌజన్య’. కొత్త దర్శకురాలు ల‌క్ష్మీ సౌజ‌న్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'వరుడు కావలెను' నుంచి 'కోల కళ్ళే ఇలా' అనే మెలోడీ సాంగ్ ప్రోమో వీడియోని రిలీజ్ చేశారు.

'కోల కళ్ళే ఇలా.. గుండె గిల్లే ఎలా.. నీలి మబ్బుల్లోనే నేను తేలేంతలా..' అంటూ సాగిన ఈ పాటకు విశాల్ చంద్ర‌శేఖ‌ర్ స్వరాలు సమకూర్చారు. 'గుండె నువ్వే ఇలా.. చంపుతుంటే ఎలా.. కొత్త రంగుల్లో ప్రాణం తడిసెంతలా' అంటూ సింగర్ సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మరోసారి మెస్మరైజ్ చేసాడు. ఈ మెలోడీ సాంగ్ కి రాంబాబు గోశాల సాహిత్యం అందించారు. ఇందులో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సాయంత్రం గం. 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసుల సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నదియా - మురళీశర్మ - వెన్నెల కిశోర్ - ప్రవీణ్ - హర్ష వర్ధన్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


Full View
Tags:    

Similar News