#వకీల్ సాబ్.. నయా OTT డీల్ తో అదనపు రెవెన్యూ?
ఓటీటీలో డీల్ మారితే అదనపు ఆదాయానికి ఆస్కారం ఉంటుందా? అంటే అవుననే నిర్మాత కం బిజినెస్ మేన్ దిల్ రాజు నిరూపిస్తున్నారు. నిజానికి ఆయన నిర్మించిన వకీల్ సాబ్ ఓటీటీ డీల్ ఒకసారి ముగిసినా.. దానిని రీడిజైన్ చేసి మరో 12 కోట్లు అదనంగా ఆర్జించారన్నది పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
వకీల్ సాబ్ గొప్ప రివ్యూలతో థియేటర్లలో ఆడినా కానీ.. కరోనా సెకండ్ వేవ్ వల్ల నష్టాలు తప్పలేదు. కానీ ఆ నష్టాల్ని ఇప్పుడు తెలివిగా ఓటీటీ డీల్ ని రీడిజైన్ చేయడం ద్వారా వెనక్కి రప్పించడంలో దిల్ రాజు మాస్టర్ ప్లాన్ వర్కవుటైందని చెబుతున్నారు. అయితే థియేటర్లలో రిలీజ్ చేసిన పంపిణీదారులకు ఈ ఒప్పందం వల్ల నష్టాలు తగ్గుతాయా? అంటే అందుకు ఆస్కారం లేదు. ఇది కేవలం నిర్మాతకు మాత్రమే లాభం.
నిజానికి వకీల్ సాబ్ చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రికార్డు ధర 14 కోట్లకు కొనుగోలు చేసింది. నియమం ప్రకారం... ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన రోజు నుండి 56 రోజుల తరువాత ప్రసారం చేయాలన్నది ఒప్పందం. కానీ సెకండ్ వేవ్ వల్ల వకీల్ సాబ్ థియేటర్ల రన్ వేగంగా ముగిసింది.
అందుకే ఇప్పుడు వకీల్ సాబ్ ఓటీటీ డీల్ ని రీడిజైన్ చేశారు. ఈ కొత్త ఒప్పందం ప్రకారం కేవలం 21 రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు. అంటే మొదట కుదుర్చుకున్న డీల్ కంటే సగం రోజుల్లోనే రిలీజ్ సాధ్యమవుతోంది. వకీల్ సాబ్ ప్రారంభ డిజిటల్ డీల్ తో పోలిస్తే ఇప్పుడు దిల్ రాజు 12 కోట్ల రూపాయలు ఎక్కువ ఆర్జిస్తున్నారు. అలాగే దిల్ రాజు కొత్త ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు పంపిణీదారులకు సమాచారం ఇచ్చారని తెలిసింది. ఈ నెల 30 నుంచి అమెజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్ అందుబాటులో ఉంటుంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ కి ఇది అధికారిక రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అంత పెద్ద స్టార్ నటించిన సినిమాని కేవలం 21 రోజుల్లో ఓటీటీల్లో రిలీజ్ చేయడంపై పంపిణీ ఎగ్జిబిషన్ వర్గాల్లో వ్యతిరేకత నెలకొందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనివల్ల మునుముందు ఎగ్జిబిషన్ రంగానికి ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళన అందరిలోనూ ఉంది.