ఉప్పెనః ఆ పాత కథను కొత్తగా చూపించే ప్రయత్నం!

Update: 2020-12-16 04:19 GMT
మెగా ఫ్యామిలీ నుండి ఉప్పెన సినిమాతో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది ఆరంభంలోనే సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. కాని కరోనా వల్ల సినిమా ఆగిపోయింది. ఓటీటీ ద్వారా ఈ సినిమా విడుదలకు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. కాని వైష్ణవ్‌ తేజ్ మొదటి సినిమా అవ్వడం వల్ల ఖచ్చితంగా థియేటర్‌ రిలీజ్‌ చేస్తే ఆయన కెరీర్‌ లో అదో తీపి గుర్తుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో నిర్మాతలు నష్టాలను కూడా ఓర్చుకుంటూ విడుదల వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమా పాటలు ఇప్పటికే సినిమాపై అంచనాను పెంచేశాయి.. ఇదే సమయంలో సినిమాపై ఒక అవగాహణకు వచ్చేలా చేశాయి.

పాత సినిమాలో కథ మాదిరిగా ఈ సినిమాలో హీరో పేద వాడు.. హీరోయిన్‌ ఉన్నత కుటుంబంకు చెందిన అమ్మాయి. పేదింటి కుర్రాడు తన కూతురును ప్రేమించడం ఇష్టం లేకపోవడంతో హీరోయిన్‌ తండ్రి హీరో కుటుంబానికి తీరని అన్యాయం చేశాడు. సినిమాలో అది చాలా కీలకమైన పాయింట్ గా చెబుతున్నారు. గతంలో చిరంజీవి నటించిన ఒక సినిమాలో కాస్త అటు ఇటుగా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. ఇప్పుడు వైష్ణవ్‌ తేజ్‌ సినిమా కోసం సుకుమార్‌ పెట్టాడు.

పలువురు దర్శకులు నిర్మాతలు మెగా ఫ్యామిలీకి చెందిన వారు ఈ కథ విని ఆ పాయింట్‌ విషయంలో చాలా ఎగ్జైట్‌ అయ్యారట. అయితే ప్రేక్షకులు ఆ పాయింట్‌ ను ఎలా రిసీవ్‌ చేసుకుంటారు అనేది చర్చనీయాశంగా ఉంది. ఆ పాయింట్‌ ప్రేక్షకులకు నచ్చితే ఖచ్చితంగా సినిమా హిట్‌ అంటున్నారు. హీరో ఫ్యామిలీకి హీరోయిన్‌ తండ్రి చేసింది ఏంటీ.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటీ అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News