ఊర్వ‌శి లెహంగా 55 ల‌క్షలు.. లేవ‌లేక ప‌డిందిలా!!

Update: 2020-11-24 06:50 GMT
వార్డ్ రోబ్ మాల్ ఫంక్ష‌న్ అనే ప‌దం త‌ర‌చుగా విన‌బ‌డుతుంటుంది. రెడ్ కార్పెట్ పై హంస‌న‌డ‌క‌లు న‌డిచేప్పుడు ర్యాంప్ వాక్ లు చేసేప్పుడు భామ‌ల త‌డ‌బాటునే ఇలా పిలుస్తారు. ఉన్న‌ట్టుండి ఒంటిపై నుంచి నూలు పోగు నిల‌వ‌కుండా జారిపోతే దానికి ప‌బ్లిక్ అవాక్క‌వుతుంది. ఆ షో అట్ట‌ర్ ఫ్లాప్ అవుతుంది. కానీ ఇదే మాల్ ఫంక్ష‌న్ స‌ద‌రు భామ‌కు గొప్ప పాపులారిటీ కూడా తెచ్చేస్తుంటుంది ఒక్కోసారి. డిజైన‌ర్ చీవాట్లు తిన్నా కానీ మోడ‌ల్ హిట్ట‌యిన‌ట్టే.

అదంతా స‌రేకానీ.. ఇక్క‌డ ఊర్వ‌శి రౌతేలా ధ‌రించిన ఆ బ‌రువైన లెహంగా ఊశారా?  చూస్తుంటేనే అంత బ‌రువు ఎలా మోస్తోంది? అని అవాక్క‌వుతంది యూత్. అయితే చూప‌రుల మాటేమో కానీ.. ఈ లెహంగా ఖ‌రీదెంతో తెలిస్తే షాక్ తిన‌కుండా ఉండ‌లేరు. దీని పేరు జాస్ మ‌న‌క్ లెహెంగా.. ఖ‌రీదు 55 ల‌క్ష‌లు.

అంత‌గా ఏం ఉంది? అంటే దానిని పొర‌లు పొర‌లుగా డిజైన్ చేసిన తీరుకు ఎంబ్రాయిడ‌రీ వ‌ర్క్ .. అలాగే అందులో ఉప‌యోగించిన మెట‌ల్ ఇవ‌న్నీ చాలా కాస్ట్ లీ అట‌. నేహాక‌క్క‌ర్ పెళ్లి వేడుక‌లో ఇలా ఊర్వ‌శి రౌతేలా ప్ర‌త్య‌క్ష‌మైంది. లేవ‌బోయి ప‌డేంత‌గా ఆ కాళ్ల‌కు లెహంగా అడ్డుప‌డుతోంది మ‌రి. అందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. రౌతేలా కెరీర్ సంగ‌తి చూస్తే గ్రాండ్ మ‌స్తీ.. హేట్ స్టోరి 4 చిత్రాల‌తో బాలీవుడ్ లో హీట్ పెంచింది. ప్ర‌స్తుతం వ‌రుస క‌మిట్ మెంట్ల‌తో బిజీగా ఉంది. ప‌నిలోప‌నిగా సోషల్ మీడియా హాటెస్ట్ స్టార్ గానూ ఓ వెలుగువెలుగుతోంది. బుల్లితెర నుంచి వ‌చ్చి వెండితెర నాయిక‌గా వెలుగుతున్న భామ‌గా పాపులారిటీని పెంచుకుంది.
Tags:    

Similar News