రాజమండ్రిలో మొదలైన 'ఉప్పెన' సక్సెస్ సందడి
కొన్ని ప్రేమజంటలను చూసినప్పుడు ఆ అమ్మాయి ఈ అబ్బాయికి ఎలా పడిందో, ఈ అబ్బాయికి ఆ అమ్మాయి ఎలా నచ్చిందో అని అనుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయినా పొంతన .. పోలిక చూసుకోవడానికి వాళ్లు కవలలు కాదుగదా .. ప్రేమికులు. ప్రేమికుల ఎంపికలో ఆ మాత్రం తేడా లేకపోతే ప్రేమ గుడ్డిదని ఎందుకంటారు? ప్రేమ వెనుక ఎప్పుడూ రిస్క్ ఉంటుంది. నిజం చెప్పాలంటే రిస్క్ లేకపోతే అది ప్రేమే కాదు .. ప్రేమకథనే కాదు. అలాంటి ప్రేమకథతోనే 'ఉప్పెన' ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకుడిగా వ్యవహరించాడు. కథాకథనాల పరంగా .. సంగీతం పరంగా ఈ సినిమా యూత్ హృదయాలను చాలావరకూ కొల్లగొట్టగలిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఇంతవరకూ ఈ సినిమా 40 కోట్ల షేర్ ను రాబట్టినట్టు నిర్మాతలు చెబుతున్నారు. ఒక కొత్త హీరో సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం నిజంగా గొప్ప విషయమనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చరణ్ ముఖ్య అతిథిగా ఈ సినిమా 'బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్' ప్రస్తుతం 'రాజమండ్రి'లో జరుగుతున్నాయి.
'ఉప్పెన' సినిమా గ్రామీణ నేపథ్యంలో .. సముద్రతీరంతో ముడిపడిన కథ కావడం వలన, ఈ సినిమా నుంచి వదిలిన పాటల కారణంగా మొదటి నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇంతగా థియేటర్లకు ప్రేక్షకులు ఎగబడటానికి, వైష్ణవ్ తేజ్ మెగా ఫ్యామిలీ నేపథ్యం నుంచి రావడం ఒక కారణమైతే .. హీరోయిన్ కృతి శెట్టి గ్లామర్ మరో కారణంగా చెప్పుకోవచ్చు. థియేటర్ బయటికి వచ్చిన ప్రేక్షకులంతా, ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇలాంటి పిల్లను మా ఊళ్లో అయితే చూడలేదని చెబుతున్నారు. అలాంటప్పుడు ఇక వసూళ్లు పెరగకుండా ఎలా ఉంటాయి?