వాలెంటైన్స్ డే స్పెషల్: ఇప్పటికైనా ఈ రూమర్డ్ జంటలు నోరు విప్పుతాయా?

టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల బంధమే.;

Update: 2026-02-14 09:52 GMT

ప్రేమకు భాషతో పనిలేదని అంటారు, కానీ సినీ పరిశ్రమలో ప్రేమకు రూమర్లతో విడదీయలేని బంధం ఉంది. అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు కొందరు తారలు కెమెరా ముందు ఎంత యాక్టివ్‌గా ఉంటారో, తమ వ్యక్తిగత జీవితంపై అంత సైలెంట్‌గా ఉంటారు. సోషల్ మీడియా పోస్టులు, విదేశీ పర్యటనలు చూస్తుంటే వారు ప్రేమికులే అనిపిస్తున్నా, నోరు విప్పి అంగీకరించడానికి మాత్రం తటపటాయిస్తున్నారు. నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ఆసక్తికర 'సీక్రెట్' జంటల గురించి ఓ లుక్కేద్దాం.

సౌత్ సెన్సేషన్:

టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల బంధమే. 'గీత గోవిందం' నాటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరుగుతోంది.ఇక ఒకే చోట వెకేషన్లు చేయడం, ఒకరి దుస్తులను మరొకరు ధరించడం వంటి హింట్లు ఫ్యాన్స్‌కు అందిస్తూ చివరకు ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇక ఈ నెలలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. వెడ్డింగ్ పనులు కూడా మొదలయ్యాయి . ఇక ఈ నెల చివరి వారం లో పెళ్లి, మార్చి 4వ తేదీన రిసెప్సన్ జరగనున్నట్టు సమాచారం. ఇంత జరుగుతున్న ఇప్పటికి ఈ జంట సైలెంట్ గా వుండటం హైలెట్. మరోవైపు, అతి తక్కువ కాలంలో స్టార్ డమ్ అందుకున్న శ్రీలీల గురించి కూడా ఇండస్ట్రీలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వకుండా తన పని తాను చేసుకుపోతోంది. కనీసం ఈ ప్రేమల పండుగ రోజైనా వీరు తమ రిలేషన్‌షిప్‌పై ఒక స్పష్టతనిస్తారేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీలు:

హిందీ పరిశ్రమలో శ్రద్ధా కపూర్ మరియు రైటర్ రాహుల్ మోడీల వ్యవహారం ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. తూ ఝూతీ మే మక్కార్ షూటింగ్ సమయం నుంచి వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల జామ్‌నగర్‌లో జరిగిన అంబానీ వేడుకల్లోనూ వీరు కలిసి కనిపించడంతో ఈ రూమర్లు మరింత బలపడ్డాయి. అలాగే, అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ తన పాత స్నేహితుడు శిఖర్ పహారియాతో మళ్ళీ ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం నుంచి బాలీవుడ్ పార్టీల వరకు శిఖర్ ఆమె వెంటే ఉండటం చూస్తుంటే, వారిద్దరూ త్వరలోనే శుభవార్త చెబుతారనిపిస్తోంది. పెళ్లి పీటల వరకు వెళ్లే ఈ జంటలు తమ ప్రేమను ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి.

గుసగుసలకు ముగింపు పడేనా:

సినిమా స్టార్ల వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక పజిల్ లాగే ఉంటుంది. కెమెరా కంటికి చిక్కినా, సాక్ష్యాలు దొరికినా 'మేము స్నేహితులం మాత్రమే' అని చెప్పడం సినీ సెలబ్రిటీలకు అలవాటుగా మారింది. అయితే, అభిమానులు మాత్రం తమ అభిమాన నటీనటులు తమ భాగస్వాములతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగానైనా ఈ జంటలు తమ మనసులోని మాటను బయటపెట్టి, నిరంతరం వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెడతాయని ఆశిద్దాం.

Tags:    

Similar News