• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఉపేంద్ర 2.. నేను కాదు...

ఉపేంద్ర 2.. నేను కాదు నువ్వు

By - Tupaki Desk
Update: 2015-08-10 07:48 GMT

Full View
16 ఏళ్ల కిందట వచ్చిన ఉపేంద్ర సినిమా కన్నడలోనే కాదు.. తెలుగులోనూ ఓ పెద్ద సంచలనం. అప్పటిదాకా సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియాలోనే అలాంటి ఓ హీరో క్యారెక్టరైజేషన్ తో ఎవ్వరూ సినిమా తీసింది లేదు. హీరో హిపోక్రసీకి తావివ్వకుండా ప్రేమ కోసం ఒకరు, డబ్బు కోసం ఒకరు, సుఖం కోసం ఇంకొకరిని ప్రేమించాలనుకోవడం.. ఈ కాన్సెప్ట్ అప్పట్లో జనాల మతి పోగొట్టింది. నిజానికి ఇప్పుడొచ్చినా ఫ్రెష్ గా కాంటెంపరరీగా అనిపించే కాన్సెప్ట్ ఉపేంద్ర సినిమాది. ఆ సినిమాలో హీరో పాత్ర పేరే ‘నేను’ అన్నది గుర్తుండే ఉంటుంది. సినిమాలో ఆ క్యారెక్టర్ చూసి చాలామంది అదే తరహాలో నిజజీవితంలో ప్రవర్తించారంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. మగాడిలోని ఇగోను సంతృప్తి పరిచే ఆ సినిమా అప్పల్లో మగమహారాజులకు భలేగా నచ్చేసింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఎగబడి చూశారా సినిమాను.

ఇన్నేళ్ల తర్వాత ఉపేంద్ర సినిమాకు సీక్వెల్ గా ఉపేంద్ర-2 తీశాడు ఉప్పి. కన్నడ లో ఉప్పి-2గా ఈ నెల 14న రిలీజవబోతోంది. తెలుగులో కూడా అదే రోజు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆడియో ఫంక్షన్ చేసి.. ట్రైలర్ రిలీజ్ చేశారు. చాలా సంక్షిప్తంగా ఉన్న ట్రైలర్ అది. మహా అయితే అర నిమిషం ఉంటుంది. కానీ ఆ అర నిమిషంలోనే ఎంత ఆసక్తి రేపాలో అంతా రేపాడు ఉప్పి. ఉపేంద్ర లో ‘నేను’ అనే పాత్ర వేస్తే.. ఇందులో ‘నువ్వు’ అనే క్యారెక్టర్ చేశాడు. అంటే ఉపేంద్ర ‘నా’ అనే కోణంలో సాగితే.. ఇది ‘నీ’ అనే యాంగిల్లో ఉంటుందన్నమాట. క్యాప్షన్ కూడా ‘నేను కాదు నువ్వు’ అని పెట్టాడు ఉపేంద్ర. ట్రైలర్ లో అతడి లుక్ కూడా చూపించలేదు. ఏదో అఘోరా పాత్ర వేసినట్లు మాత్రం స్పష్టమవుతోంది. మరో సెన్సేషనల్ కాన్సెప్ట్ తోనే ఉప్పి బాక్సాఫీస్ దండయాత్రకు వస్తున్నట్లున్నాడు. అతడి ఫ్యాన్స్ కు మరోసారి పండగేనన్నమాటే.

Tags:    
  • Upendra 
  • Uppendra 2 Movie 
  • Telugu NEws 

Similar News

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

Copyright @2026

Powered by Blink CMS