చరణ్ వెనక్కు వస్తాడా?

Update: 2018-11-14 07:54 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఎంత మంది అశేష అభిమానులు ఉన్నా సోషల్ మీడియా వాడకంలో మాత్రం తనకు తాను కొన్ని పరిమితులు విధించుకున్నాడు. అందులో ముఖ్యమైనది ట్విట్టర్ అకౌంట్ లేకపోవడం. నిజానికి చరణ్ కు 2012 వరకు ఇందులో తన పేరు మీద ఐడి ఉండేది. కానీ ఆ సమయంలో తాను పెట్టిన ఓ పోస్టుకు తప్పుడు అర్థాలు తీసి వేరే దర్శకుడికి అన్వయించడం వల్ల అది కాస్తా వైరల్ అయ్యి వెర్బల్ వార్ కు దారి తీసింది. ఇది తలనొప్పిగా భావించిన చెర్రీ ట్విట్టర్ కు గుడ్ బై చెప్పేసి పూర్తిగా ఫేస్ బుక్ కే పరిమితమయ్యాడు.

అందుకే చరణ్ తరఫున భార్య ఉపాసన ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ ఫామిలీతో పాటు సినిమాలకు సంబందించిన విశేషాలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పటి నుంచే తమ హీరో మళ్ళి రావాలని కోరుకుంటున్న అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంది. కానీ తాజాగా జరిగిన ఉదంతం వారి కోరికను నెరవేరుస్తుందేమో చూడాలి. ఉపాసన ఇటీవలే తన తల్లి శోభన కామినేనితో కలిసి ఢిల్లీ సందర్శనకు వచ్చిన ట్విట్టర్ కో ఫౌండర్ జాక్ డోర్సేతో మీటింగ్ లో పాల్గొన్నారు. వాటికి సంబందించిన పిక్స్ ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. అర్థవంతమైన జీవితానికి శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతున్న ట్విట్టర్ ఫౌండర్ ను కలుసుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉపాసన ఫోటోలు ట్వీట్ చేసారు.

దీంతో చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ లోకి వచ్చేసి అన్నయ్యను ఎలాగైనా ఒప్పించి మళ్ళి ట్విట్టర్ లో వచ్చేలా చేయమని కోరుతున్నారు. ఈ మేరకు రీ ట్వీట్లన్ని దీన్నే ప్రస్తావిస్తూ కొనసాగడంతో ఉపాసన చరణ్ ను ఏమైనా కన్విన్స్ చేస్తుందేమో చూడాలి. ఫేస్ బుక్ కన్నా ధీటుగా ట్విట్టర్ లో ఫాలోయింగ్ ఉంటుందని ఇది మిస్ కాకూడదని అభిమానుల కోరిక. మరి చరణ్ కన్విన్స్ అయ్యి సిగ్నల్ ఇస్తాడా లేదా వేచి చూడాలి
    

Tags:    

Similar News