కంగ‌న నియంత అనేది ట్విట్ట‌ర్ ఉద్ధేశ‌మా?

Update: 2021-02-05 09:41 GMT
కంగ‌న‌తో ట్విట్ట‌ర్ రుబాబ్ మ‌రోసారి వేడెక్కిస్తోంది. గ‌తంలో ఓమారు కంగ‌నకు వ్య‌తిరేకంగా ట్విట్ట‌ర్ బ్యాన్ గురించి తెలిసిన‌దే. ఇప్పుడు మ‌రోమారు  క్వీన్ కంగనా రనౌత్ చేసిన రెండు ట్వీట్లను తొలగించడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కంగ‌న‌ పోస్టులు విద్వేషాన్ని ర‌గిలించేవిగా ఉన్నాయ‌ని నిబంధనలను ఉల్లంఘిస్తున్నార‌ని ట్విట్ట‌ర్ ఆరోపించింది. ఆ రెండు ట్వీట్ల తొలగింపు ఒక రోజులో రెండు గంటల వ్య‌వ‌ధిలోనే జరిగింది. ఈ రెండు ట్వీట్లు రైతుల నిరసనలకు సంబంధించినవి. మా పరిధి మేర‌కు తొల‌గించాల్సి వ‌చ్చింద‌ని ట్విట్ట‌ర్ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు.

పాప్ సింగర్ రిహన్న ట్వీట్ జాతి వ్య‌తిరేక‌త‌పైనా కంగ‌న ఇంత‌కుముందు దునుమాడిన సంగ‌తి తెలిసిందే. రిహానా ఎపిసోడ్ తోనే తాప్సీపైనా ఫిరంగులు విసిరిన కంగ‌న‌.. ఇప్ప‌టికీ ఆ వార్ ని అలానే కొనసాగిస్తోంది. వాతావరణ కార్యకర్త గ్రెటా థన్ బెర్గ్ ‌పై కంగనా దాడి చేసిన తరువాత క్రికెటర్లపైనా ఇంత‌కుముందు కంగ‌న‌ విరుచుకుపడింది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కొనసాగుతున్న నిరసనలపై తన అభిప్రాయాలను పంచుకోగా దానికి కౌంట‌ర్ గా కంగ‌న ట్వీట్ చేసింది.

``ఈ క్రికెటర్లందరూ ధోబీ కా కుట్టా నా ఘర్ కా నా ఘాట్ కా అని ఎందుకు ధ్వనిస్తున్నారు? రైతులు వారి శ్రేయస్సు కోసం విప్లవాత్మకమైన చట్టాలకు ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు. వీరు ఉగ్రవాదులు... నా… ఇట్నా దార్ లగ్తా హై అని చెప్పండి?`` అంటూ ఫైరైంది కంగ‌న‌. క్రికెటర్లను ధోబి కా కుట్టా(చాక‌లి కుట్ట‌) అంటూ ఘాటుగా తిట్టేయ‌డం నెటిజన్లలో మరోసారి కలకలం రేపింది.

ఈ ట్వీట్ తో పాటు.. తాప్సీ పన్నూపై కంగనా చేసిన ట్వీట్ లో ఒకదాన్ని కూడా ట్విట్టర్ తొలగించింది. తాప్సీ బి గ్రేడ్ న‌టి! అంటూ కంగ‌న చేసిన ట్వీట్ ని తొల‌గించింది. కంగ‌న ఎంత ఉత్తమ న‌టి అయినా కానీ పబ్లిక్ డొమైన్ల‌లో ప్రతిదానికీ అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం ఫైర‌వ్వ‌డం ఆమె అలవాటు. నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీంతో త‌న‌ ట్వీట్లను తొలగించమని ఆదేశాలు వ‌చ్చాయ‌ట‌. ముఖ్యంగా క్రికెట‌ర్ల‌ను తిట్టేయ‌డంతో కంగ‌న‌ అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. దీంతో ట్విట్ట‌ర్ కి అభ్య‌ర్థ‌నలు వెల్లువెత్తాయ‌ట‌.
Tags:    

Similar News