బిబి ఫైనల్‌ ఎపిసోడ్‌ గెస్ట్‌ గా ఎన్టీఆర్‌ అనుమానమే!

Update: 2020-12-15 05:06 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కు ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరుగబోతుంది. గత సీజన్‌ ఫినాలే గెస్ట్‌ గా చిరంజీవి హాజరు అయిన విషయం తెల్సిందే. ఈ సీజన్‌ కు గెస్ట్ గా ఎన్టీఆర్‌ రాబోతున్నాడు అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కూడా వచ్చే అవకాశం లేకపోలేదు అంటూ మరికొందరు చెబుతున్నారు. నాగార్జున ఎవరిని తీసుకు వస్తాడు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌ రాకకు సంబంధించి కొందరు ఖచ్చితంగా అనుమానమే అంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్‌ ఇటీవలే జెమిని టీవీతో ఒప్పందం చేసుకున్నాడు. ఒక షో ను జెమిని కోసం ఎన్టీఆర్ చేయబోతున్న విషయం తెల్సిందే.

జెమిని టీవీ కోసం షో ను చేయబోతు స్టార్‌ మా టీవీ షో లో గెస్ట్‌ గా పాల్గొనడం కుదరక పోవచ్చు. అందుకు జెమిని వారు ఒప్పుకోక పోవచ్చు అని కూడా అంటున్నారు. జెమిని టీవీ కోసం షో చేయబోతున్న ఎన్టీఆర్‌ ఇతర షోలకు ఛానెల్స్‌ కు ప్రమోషన్‌ చేయడం అగ్రిమెంట్‌ ప్రకారం తప్పు అవుతుంది. అందుకే బిగ్‌ బాస్ సీజన్‌ 4 ఫైనల్‌ ఎపిసోడ్‌ లో ఎన్టీఆర్‌ కనిపించడం అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్‌ లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఎవరిని తీసుకు రాబోతున్నారు అనేది మరింత ఆసక్తిగా మారింది. అందుబాటులో ఆ సమయంలో ఎవరు ఉంటారు అనేది కూడా చూడాలి.
Tags:    

Similar News