'వెంకీ 75' గురూజీ చేతికేనా ?
సినిమా తర్వాతే సినిమా ఒకే చేసుకుంటూ - కొన్ని సార్లు సినిమా పూర్తయ్యాక కూడా ఇంకా టైం తీసుకుంటూ సినిమాలు చేస్తుంటాడు విక్టరీ వెంకటేష్. తన ప్రతీ సినిమాకు ఆచి తూచి అన్నయ్య సలహాలతో ముందుకు వెళ్తుంటాడు. పక్కా ప్లానింగ్ తో హీరోగా కెరీర్ ను కొనసాగించే వెంకీ ప్రస్తుతం ఓ ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడా ? లేదా అనేది మాత్రం అర్ధం కావట్లేదు.
దానికి కారణం వెంకీ నెక్స్ట్ సినిమా నంబర్. ఇటీవలే తమిళ నిర్మాతతో కలిసి వెంకటేష్ హీరోగా 'అసురన్' రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు సురేష్ బాబు. అంతే కాదు ఈ రీమేక్ వెంకీ కి 74 వ సినిమా అంటూ నంబర్ తో అనౌన్స్ చేసాడు. దీంతో వెంకీ ప్రతిష్టాత్మకమైన 75వ సినిమా ఎవరితో ఉంటుందా ? అనే అనుమానాలు మొదలయ్యాయి.
ఓ వైపు వెంకీ కోసం రేసింగ్ నేపథ్యంలో కథను రెడీ చేస్తున్న తరుణ్ భాస్కర్ విక్టరీ 75 వ సినిమా తనదే అంటున్నాడు. ఇంకా క్లారిటీ లేదు అని చెప్తూనే తన మనసులో మాటను బయటపెట్టాడు. ఇక వెంకీ త్రివిక్రమ్ 75 వ సినిమా చేస్తాడని టాక్ కూడా ఉంది. ఆల్మోస్ట్ రామానాయుడు స్టూడియోస్ లో కూడా మాటల మంత్రికుడే వెంకీ 75 వ సినిమాకు దర్శకుడంటూ గట్టిగా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వెంకీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అన్నది ప్రశ్నార్థంకంగా మారింది.