వృషకర్మ: చైతూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక ప్లాన్ ఏంటి?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య తన కెరీర్ లో కొత్త దిశగా అడుగులు వేస్తున్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది.;

Update: 2026-03-23 10:30 GMT

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య తన కెరీర్ లో కొత్త దిశగా అడుగులు వేస్తున్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎక్కువగా లవర్‌ బాయ్ ఇమేజ్‌ తో ప్రేక్షకులను అలరించిన చైతన్య, ఇప్పుడు వరుసగా భిన్నమైన కథలను ఎంచుకుంటూ తనను తాను కొత్తగా చూపించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ వృషకర్మపై ఆసక్తి నెలకొంది.

భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఆ చిత్రం ఒక మైథికల్ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. తమిళ వెర్షన్ కూడా ఉండనున్న ఆ ప్రాజెక్టు ద్వారా కొత్త తరహా పాత్రలో కనిపించేందుకు చైతన్య సిద్ధమవుతున్నారు. "ప్రతి సినిమాతో కొత్తగా కనిపించాలని నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు వృషకర్మ మూవీలో కూడా అంతే. ఇప్పటివరకు చేయని డార్క్ స్పేస్‌ లో ఉండే మైథికల్ థ్రిల్లర్‌ లో భాగమవడం నాకు చాలా కొత్త అనుభవం" అని చైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇటీవల తండేల్ సినిమాలో తన నటనకు గాను తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ లో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న చైతన్య, ఆ చిత్రంలోని తండేల్ రాజు పాత్ర తన కెరీర్‌ కు కీలక మలుపు తీసుకువచ్చిందని చెప్పారు. "నా 17 సంవత్సరాల సినీ ప్రయాణంలో తండేల్ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ఆ సినిమా వల్ల నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది" అని ఆయన పేర్కొన్నారు.

ఆ ఎక్స్పీరియన్స్ తనలో ఉన్న క్రియేటివ్ హంగర్‌ ను మరింత పెంచిందని, దాని ఫలితంగా వృషకర్మ వంటి డేరింగ్ స్టోరీ ఎంచుకున్నట్లు నాగ చైతన్య తెలిపారు. ఆ చిత్రంలో ఆయన ఒక అడ్వెంచరస్ ట్రెజర్ హంటర్‌ గా కనిపించనున్నారు. కథలో డార్క్ షేడ్స్‌ తో పాటు మోరల్ మెసేజ్ కూడా ఉండబోతుందని చెప్పారు. ప్రస్తుతం ఆ సినిమా ఆయన కెరీర్‌ లోనే అత్యధిక వీఎఫ్ ఎక్స్ వినియోగం ఉన్న ప్రాజెక్ట్‌ గా నిలవనుందని టాక్ వినిపిస్తోంది.

భారీ విజువల్స్, హై టెక్నికల్ ఎలిమెంట్స్ తో ఆ చిత్రాన్ని ఇంటర్నేషనల్ రేంజ్ లో రూపొందించేందుకు చిత్రబృందం కృషి చేస్తోంది. ఇక వృషకర్మ చిత్రానికి తమిళనాడులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు నాగ చైతన్య వెల్లడించారు. దక్షిణాది మొత్తం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆ సినిమా రూపొందుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

ఏదేమైనా ఇప్పటివరకు ప్రేమ కథలతో గుర్తింపు పొందిన నాగ చైతన్య.. ఇప్పుడు విభిన్నమైన, కంటెంట్‌ బేస్డ్ కథల వైపు అడుగులు వేస్తుండటం ఆసక్తికరంగా మారింది. తనలోని నటుడిని కొత్త కోణాల్లో ఆవిష్కరించేందుకు చేస్తున్న ఆ ప్రయత్నం ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు పెంచుతోంది. మరి వృషకర్మ మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో.. చైతన్య కెరీర్‌ లో మరో కొత్త చాప్టర్ మొదలవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News