ఆప్త మిత్రుడితో పవన్ నెం.4
పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఉన్న ఆప్త మిత్రులు ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు త్రివిక్రమ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరి మద్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరికి చాలా విషయాల్లో సిమిలారిటీస్ ఉంటాయి. అందుకే ఇద్దరి మద్య స్నేహం అలా కుదిరి ఉంటుందని ఫ్యాన్స్ అంటూ ఉంటారు. పవన్ ఏం చేసినా కూడా అది త్రివిక్రమ్ కు తెలిసే జరుగుతుందని కొందరి అభిప్రాయం. ముఖ్యంగా సినిమాలకు చెందిన ప్రతి విషయంలో కూడా పవన్ కు త్రివిక్రమ్ నుండి సలహాలు సూచనలు వస్తాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. పవన్ 25వ చిత్రంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి చిత్రం వచ్చింది. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చిన విషయం తెల్సిందే. ఆప్త మిత్రుడికి సూపర్ హిట్ ను ఇవ్వలేక పోయానని త్రివిక్రమ్ బాధ పడుతూనే ఉన్నాడట. పవన్ రాజకీయాల్లో కొన సాగుతూనే సినిమాలు చేయాలని నిర్ణయించుకుని వరుసగా మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఇప్పటికే రెండు సినిమాలు పట్టాలెక్కాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో పవన్ నెం.4 చిత్రంగా త్రివిక్రమ్ దర్శకత్వం లో ఉంటుందని సమాచారం అందుతోంది.
పవన్ రీ ఎంట్రీ అంటూ వార్తలు వచ్చిన వెంటనే ఖచ్చితంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తాడని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే ప్రస్తుతం పవన్ కోసం ఖచ్చితంగా హిట్ అయ్యే ఒక సబ్జెక్ట్ ను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ అడిగితే ఖచ్చితంగా పవన్ ఓకే చెప్తాడు. కనుక వీరిద్దరి కాంబోలో మూవీ ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాది అయినా వస్తుందని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తదుపరి చిత్రం అంటూ వార్తలు వచ్చాయి. కాని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. త్రివిక్రమ్ తన తదుపరి చిత్రంగా ఎవరితో చేస్తాడు అనేది చూడాలి.