బన్నీ, త్రివిక్రమ్.. కాంబో కన్ఫామ్!!

Update: 2016-04-08 04:21 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు చిత్రాన్ని ఇప్పటికే కంప్లీట్ చేసేశాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రూపొందిన సరైనోడు ఈ నెల 22న విడుదల అవుతోంది కూడా. మరోవైపు అ..ఆ.. సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్ చేస్తున్నాడు. ఈ మూవీ ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చేసింది. ఇది మే నెలలో విడుదల కానుంది.

త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై చాలానే టాక్స్ వినిపించాయి. అందులో బన్నీతో సినిమా అనే న్యూస్ కూడా ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో రెండు సినిమాలు జులాయి - సన్నాఫ్ సత్యమూర్తి తీసిన త్రివిక్రమ్.. మూడోది కూడా చేస్తున్నాడని అన్నారు. ఇప్పటివరకూ ఇది రూమరే కానీ.. ఇప్పుడు కన్ఫాం చేసేసుకోవచ్చు. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో గత రెండు చిత్రాలను హారిక&హాసిని బేనర్ లోనే తీశారు.

బన్నీ-త్రివిక్రమ్ ల కాంబినేష్ లో మూడో సినిమా కూడా ఇదే నిర్మాణ సంస్థలో తీయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా.. దర్శకుడు త్రివిక్రమ్ - నిర్మాత ఎస్ రాధాకృష్ణ ఉమ్మడిగా ఇచ్చిన బర్త్ డే విషెస్ పోస్టర్.. ఈ విషయాన్ని చెప్పేస్తుంది. పుట్టిన రోజుకు శుభాకాంక్షలు చెప్పేస్తే సినిమా కన్ఫాం యేనా అనుకోవచ్చు కానీ.. వీళ్లు ఈ విషెస్ కలిపి ఒక పోస్టర్ గా వేసి ఇవ్వడమే ఇక్కడ క్లూ.
Tags:    

Similar News