త్రివిక్రమ్ ఒప్పందం సూర్యతో కాదు
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ హీరోతో సినిమా తీయబోతున్నాడు? ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఇది. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ఉలుకూ పలుకూ లేనేలేదు. అయితే త్రివిక్రముడు సైలెంటుగా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఇప్పటికే నితిన్, నాగచైతన్య లైన్‌లో ఉన్నారు కాని, సడన్‌గా మనోడు తమిళ హీరో సూర్యతో త్రివిక్రమ్ ఓ బైలింగువల్ సినిమా చేస్తున్నాడనే న్యూస్ టాలీవుడ్‌లో దద్దరిల్లిపోయింది.
అయితే ఈ న్యూస్‌లో నిజమెంత? దీని గురించి ఆరా తీస్తే ఒక విషయం తెలిసింది. అసలు త్రివిక్రమ్ ఇప్పటివరకూ సూర్యకి కథ చెప్పలేదు. కాకపోతే సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజాకి చెందిన స్టూడియోగ్రీన్ సంస్థతో ఓ సినిమా కోసం ఒప్పందం చేసుకున్నాడు. దానికి సంబంధించిన మీటింగ్స్ ఇటీవల జరిగాయి. అయితే సూర్యతో ఇప్పుడే సినిమా ఉంటుందా? లేదా? అన్నది తేలలేదింకా. చైతన్య, మహేష్‌లతో సినిమాలు పూర్తయ్యాక 2016 చివరిలో సూర్యతో సినిమా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏదేమైనా త్రివిక్రమ్ సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదనమాట. ఏదో ఒప్పందం అయ్యింది కాని.. మూవీ ఫైనలైజ్ కాలేదు. అదీ మ్యాటరు.