పవన్‌ ఫోనుతో త్రివిక్రమ్ షాకిచ్చాడు

Update: 2016-05-28 04:44 GMT
మైండ్‌ బ్లోయింగ్‌ న్యూస్‌ విన్నప్పుడు మైండ్ బ్లోయింగ్ అనిపించదు కాని.. ఆ న్యూస్ ను కాస్త కాస్తగా మనం డైజెస్ట్ చేసుకుంటుంటే మాత్రం.. వామ్మో అసలు ఇది నమ్మాలా వద్దా అనిపిస్తుంటుంది. ఇప్పుడు నితిన్‌ ఇచ్చిన ఒక స్టన్నర్ అలాగే ఉంది.

నిజానికి రెండు రోజుల క్రితమే నితిన్‌-సమంత-నదియా లు ఒక ఇంటర్యూ రికార్డు చేశారు. దానినే నిన్నే మీడియాకు రిలీజ్‌ చేశారు. ఈ ఇంటర్యూలో నితిన్‌ బాబు మాట్లాడుతూ.. తాను ఇంటర్యూ ఇవ్వడానికి వస్తుంటే సడన్‌ గా ''పవర్ స్టార్‌'' నుండి ఫోన్‌ వచ్చిందని.. అయితే తాను చాలా టెన్షన్‌ పడ్డానని.. ఒకసారి ఫోన్‌ ఎత్తగానే.. అక్కడ మాట్లాడుతోంది త్రివిక్రమ్ గారని.. చెప్పాడు. అంటే పవన్‌ ఫోన్‌ నుండి త్రివిక్రమ్ మాట్లాడి ట్విస్టిచ్చాడనమాట. పైగా నితిన్‌ ఏమంటున్నాడంటే.. పవన్‌ పక్కనే నుంచొని త్రివిక్రమ్ ఆ కాల్‌ మాట్లాడాడట. ఓకే బాగుంది. తన ఫ్యాన్ కు కాస్త ఎనర్జీ ఇవ్వడానికి పవన్‌ అలా త్రివిక్రమ్ తో కాల్‌ చేయించాడని అనుకుందాం.

డౌట్ నెం.1 ఏంటంటే.. మొన్ననే రష్యా వెళిపోయాడు అన్నారు.. పవన్‌ కళ్యాణ్‌ ఇంకా ఇక్కడే ఇండియాలో ఉన్నాడా? డౌట్‌ నెం.2 ఏంటంటే.. నిజంగానే ఈ కాల్‌ వచ్చిందా లేకపోతే పబ్లిసిటీ స్టంటా? డౌట్‌ నెం.3 ఏంటంటే.. ఈ పై రెండు నిజంగానే నిజమైన డౌట్లే కదా?
Tags:    

Similar News